బంగారం, వెండి ధరల పరుగులు.. దీపావళికి మరింతగా పెరిగే ఛాన్స్.. వరుసగా 3వ రోజు పెంపు..

Published : Oct 11, 2023, 11:31 AM ISTUpdated : Oct 11, 2023, 11:37 AM IST

 మన దేశ మహిళలకు బంగారం లేదా బంగారు ఆభరణాలు  అంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి పండగలు, శుభకార్యాలు, వేడుకల సమయాల్లో పసిడి కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే  పెళ్ళిళ్ళ సీజన్ సమయంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. మరోవైపు  పండగల సీజన్ రాబోతుంది.  ఇక ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం కారణం ఇండియాలో బంగారం ధర మళ్ళీ పెరుగుతుంది.   

PREV
15
బంగారం, వెండి ధరల పరుగులు.. దీపావళికి మరింతగా పెరిగే ఛాన్స్.. వరుసగా 3వ రోజు పెంపు..

అక్టోబర్ 11న ఈరోజు ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరుగుదలతో రూ. 53,800, 24 క్యారెట్ల పది గ్రాముల ధర  రూ. 330 పెరుగుదలతో రూ. 58,680. అలాగే దేశ రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ.72,600.
 

25

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య వందలాది మంది మరణించారు ఇంకా ఎంతో  మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఈ దాడులకు ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక ఆయుధాలతో  దాడి చేసింది. ఈ దాడుల కారణంగా 436 మంది పాలస్తీనియన్లు మరణించారు, వారిలో 91 మంది పిల్లలు ఇంకా  61 మంది మహిళలు ఉన్నారు, మరికొందరు గాయాలకు గురయ్యారు.

ఈ ఉద్రిక్తత పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న అస్థిరత ఫలితంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.  దింతో హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర భారతీయ నగరాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా పసిడి  ధరలు పెరగడానికి కారణమైంది.

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా అనిశ్చిత సమయాల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా ఆశ్రయించారు.  
 

35

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర    రూ.53,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,530

గురుగ్రామ్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,680

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర    రూ.53,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,530

లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,680

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,530

జైపూర్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,680

పాట్నాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,580

భువనేశ్వర్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,530

45

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్  ఔన్సుకు $1960  వద్ద, స్పాట్ సిల్వర్  $21.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.24 వద్ద ఉంది.

 తెలుగు రాష్ట్రం  విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెంపుతో  రూ. 53,650, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెంపుతో  రూ. 58,530. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ.75,500.

55

ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 300 పెంపుతో రూ.53,650గా ఉండగా , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెంపుతో  రూ.58,530గా ఉంది. 

వెండి విషయానికొస్తే హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 75,500.

అయితే, పైన పేర్కొన్న బంగారం ధరలలో GST, TCS ఇంకా ఇతర లెవీలు ఉండవని, అంటే ఇవి కేవలం సూచిక మాత్రమేనని కస్టమర్‌లు గమనించాలి. ఖచ్చితమైన  ధరల కోసం మీ సమీపంలోని నగల వ్యాపారిని సంప్రదించండి.
 

click me!

Recommended Stories