ఆక్టివా e, QC1 బుకింగ్‌లు రూ.1,000 టోకెన్ తో ప్రారంభమయ్యాయి. హోండా రూ.9,900కి కేర్ ప్లస్ ప్యాకేజీని కూడా అందిస్తోంది.
ఆక్టివా e ప్రొడక్షన్ కర్ణాటకలోని హోండా నర్సాపుర ప్లాంట్‌లో జరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 2025లో బెంగళూరులో డెలివరీలు ప్రారంభమవుతాయని చెప్పింది. తర్వాత ఏప్రిల్ 2025లో ఢిల్లీ, ముంబైలో డెలివరీలు జరుగుతాయి.