
ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం చక్రం విరిగిన ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విమాన భద్రతపై తీవ్రంగా దృష్టి పెట్టింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). అన్ని ఎయిర్‌లైన్స్‌పై తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో, పలు విమాన సంస్థలు తమ షెడ్యూల్‌లు తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. దీని ప్రభావంతో ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాసా ఎయిర్, విస్తారా, అలయన్స్ ఎయిర్ సంస్థలు తమ విమానాలను రద్దు చేశాయి.వాతావరణం, సాంకేతిక లోపాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాలు ఈ రద్దులకు కారణాలవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు అకస్మాత్తుగా తమ టికెట్ రద్దయినట్లు తెలుసుకొని, డబ్బు ఎలా తిరిగి రాబట్టాలన్న సందిగ్ధంలో పడుతున్నారు.
DGCA ప్రకారం విమాన సంస్థ తప్పిదం వల్ల రద్దయితే ప్రయాణికుడికి శాతం రీఫండ్ రావాలి. ప్రయాణంలో ఆలస్యం వల్ల రాత్రి అవసరమైతే, భోజనం, హోటల్ ఖర్చులను సంస్థే భరించాలి. ఈ నిబంధనలు చట్టబద్ధంగా అమలులో ఉన్నవి.
ఎయిర్ ఇండియా: ‘Manage Booking’ సెక్షన్ ద్వారా రీఫండ్ అభ్యర్థించవచ్చు. స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.
ఇండిగో: ‘6Eskai’ చాట్‌బాట్ ద్వారా డిటైల్స్ ఇచ్చి రీఫండ్ కోసం అప్లై చేయవచ్చు.
విస్తారా: నేరుగా సంస్థ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసినవారికి ఆటోమేటిక్ రీఫండ్.
స్పైస్‌జెట్: వెబ్‌సైట్‌లో PNR నెంబర్‌తో లాగిన్ అయ్యి రీఫండ్ అభ్యర్థించవచ్చు.
ఆకాసా ఎయిర్: "My Bookings"లో అప్లై చేస్తే, 5–7 పని రోజుల్లో డబ్బు లభిస్తుంది.
అలయన్స్ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: ఆన్‌లైన్ ద్వారా రీఫండ్ అభ్యర్థనలు తీసుకుంటారు.
ముందుగా కస్టమర్ కేర్‌ను సంప్రదించండి (PNR నెంబర్‌తో).
సమస్య పరిష్కారం కాకపోతే DGCA AirSewa పోర్టల్ (www.airsewa.gov.in) ద్వారా ఫిర్యాదు చేయండి.
డెబిట్/క్రెడిట్ కార్డ్ చెల్లింపైతే బ్యాంక్‌ను సంప్రదించి చార్జ్‌బ్యాక్ (Chargeback) అభ్యర్థించవచ్చు.
సోషల్ మీడియాలో అధికారిక ఖాతాలకు ట్యాగ్ చేస్తే వేగవంతమైన స్పందన వస్తుంది.
టికెట్, చెల్లింపు డిటైల్స్, PNR నెంబర్ భద్రంగా ఉంచండి.
సంస్థ రీఫండ్ విధానాలు చదవండి, వాటిని అనుసరించండి.
ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేయండి.
అవసరమైతే AirSewa లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
ఇప్పటి విమాన సంస్థలు రీఫండ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా మార్చాయి. ఏ సంస్థ అయినా – నేరుగా బుక్ చేసిన టికెట్‌కు రీఫండ్ పొందడం సాధ్యమే. సరైన సమాచారం ఆధారంగా ముందడుగు వేస్తే, విమాన రద్దుల సమయంలో కూడా ప్రయాణికులు ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చు.
బుకింగ్ సమయంలో ఇచ్చిన ఈమెయిల్ & మొబైల్ నెంబర్ సరిగ్గా ఉన్నాయా చెక్ చేయండి.ఎప్పటికప్పుడు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి.విమాన సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఎక్కువగా బుక్ చేయండి.ఎటువంటి ఆలస్యం వచ్చినా స్క్రీన్‌షాట్ లేదా రికార్డ్ ఉంచుకోవడం మంచిది.రీఫండ్ తీసుకున్న తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి.