Business: ప్రస్తుత కాలంలో ఫాస్ట్ ఫుడ్, సౌత్ ఇండియన్ టిఫిన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.
ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? కేవలం రెండు లక్షల పెట్టుబడితో నెలకు 70 వేల రూపాయల లాభం ఇచ్చే ఇడ్లీ, దోస ఫుడ్ ట్రక్ బిజినెస్ ప్లాన్ మీ కోసం. రోజుకు కేవలం 100 ప్లేట్లు అమ్మినా నెలకు రూ. 1.2 లక్షల టర్నోవర్ సాధించవచ్చు. ఇది చిన్న వ్యాపారస్తులకు ఒక అద్భుత అవకాశం.
25
లొకేషన్ ముఖ్యం
ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆఫీసుల దగ్గర లేదా జంక్షన్లలో ట్రక్ పెట్టడం ఉత్తమం. సరైన చోట పెడితే నెలకు రూ. 70,000 లాభం సునాయాసంగా పొందవచ్చు.
35
తక్కువ ఖర్చు.. ఎక్కువ రుచి
కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన ఇడ్లీ, దోసలను తక్కువ ధరకే (రూ. 40) అందిస్తే.. కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. మెయింటెనెన్స్ ఖర్చు నెలకు రూ. 50,000 లోపే ఉంటుంది.