డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ బిల్లులకు అత్యంత ధనవంతుడి మద్దతు.. ఆ టెక్నాలజిని నమ్ముతున్నాను అంటూ వెల్లడి..

First Published Dec 7, 2021, 1:39 PM IST

భారతదేశంలో రాబోయే క్రిప్టోకరెన్సీ(cryptocurrency) చట్టానికి దేశంలోని అత్యంత ధనవంతుల మద్దతు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ(mukesh ambani) భారత ప్రభుత్వం ప్రతిపాదించిన డేటా ప్రైవసీ అండ్ క్రిప్టోకరెన్సీ చట్టానికి మద్దతు ఇచ్చారు.

భారతీయులు  స్వంత డేటాను కలిగి ఉండటం,  నియంత్రించడం అలాగే డిజిటల్ సమాచారం ఎలా నిర్వహించబడుతుందో ఇంకా షేర్ చేయబడుతుందనే దాని గురించి దేశం బలమైన చట్టాలను రూపొందించడాన్ని ప్రతిపాదిస్తున్న ముకేష్ అంబానీ భారతదేశం అత్యంత ముందుకు ఆలోచించే విధానాలు, నిబంధనలను అమలు చేస్తోందని అన్నారు. భారతదేశపు అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాడు, అలాగే ఇది దాదాపు ఏ విధమైన లావాదేవీలకైనా అపూర్వమైన భద్రత, నమ్మకం, ఆటోమేషన్ అండ్ సామర్థ్యాన్ని అందించగలదని తెలిపాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల  క్రితం సెంబర్ 3న ఇన్ఫినిటీ ఫోరమ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఈవెంట్‌లో ఒక  ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు.

చిన్న పెట్టుబడిదారులకు రక్షణ కల్పిస్తూనే క్రిప్టోకరెన్సీలను ఆర్థిక ఆస్తులుగా వర్గీకరించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైన టెండర్‌గా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ వాటిలో పెట్టుబడి పెట్టడానికి బిల్లులో కనీస మొత్తాన్ని సెట్ చేసే అవకాశం ఉంది.


"డేటా ప్రైవసీ బిల్లు అలాగే క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టడం విషయానికి వస్తే దేశం సరైన మార్గంలో ఉందని  ముకేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. ముకేష్ అంబానీ క్రిప్టోకరెన్సీ అండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ మరికొన్ని కారణాలు ఉన్నాయి:

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని నమ్మే వ్యక్తి:  ముకేష్ అంబానీ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై చాలా నమ్మకమైన వ్యక్తి, అలాగే దీనిని క్రిప్టోకరెన్సీకి భిన్నంగా ఉందని భావిస్తున్నాడు. అతని ప్రకారం, "విశ్వాసమైన సమాజానికి బ్లాక్‌చెయిన్ చాలా ముఖ్యమైనది" అలాగే ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా ఉండే సప్లయి చైన్లను ఆధునీకరించడానికి ఉపయోగించవచ్చు.

డిజిటల్-ఫస్ట్ రివొల్యూషన్ :  ముకేష్ అంబానీ టెక్నాలజి ప్రపంచాన్ని మారుస్తుందని పునరుద్ఘాటించారు అలాగే ఇది డిజిటల్-ఫస్ట్ రివొల్యూషన్ అని కూడా అన్నారు. ఇందులో డిజిటల్ ప్రజల జీవిత మార్గంగా ఉంటుంది ఇంకా ప్రతి టెక్నాలజిలో ఉపయోగించబడుతుంది. ఐదు లేదా ఆరు రకాల టెక్నాలజి విలీనం ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయి.

 క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలపై పన్ను విధించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ అస్సెట్స్ పూర్తిగా నిషేధించాలని కోరుతోంది, ఎందుకంటే అవి దేశం  మాక్రో ఎకనామిక్ అండ్ ఫైనాన్సియల్ స్టెబిలిటీకి ముప్పు కలిగిస్తాయి.
 

వచ్చే 10 ఏళ్లలో డిసెంట్రలైజేడ్ ఫైనాన్స్ (DeFi) రంగంలో అనివార్యమైన మార్పులు వస్తాయని అంబానీ సూచించారు. DeFi అనేది బ్లాక్‌చెయిన్-ఆధారిత ఫైనాన్స్, ఇది బ్రోకరేజ్‌లు, స్టాక్ ఎక్స్ఛేంజీలు లేదా ఫిజికల్ బ్యాంక్‌లు లేకుండా పనిచేయగలదు.

డేటా ప్రైవసీ బిల్లు అండ్ క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు దేశం సరైన మార్గంలో ఉందని ముకేష్ అంబానీ చెప్పారు.  క్రిప్టోకరెన్సీ నుండి వచ్చే లాభాలపై పన్ను విధించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీలపై పూర్తి నిషేధాన్ని కోరుతోంది.

“డేటా అండ్ డిజిటల్ మౌలిక సదుపాయాలు భారతదేశానికి అలాగే ప్రపంచంలోని ప్రతి ఇతర దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. ఈ వ్యూహాత్మక డిజిటల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ నిర్మించడానికి, రక్షించడానికి ప్రతి దేశానికి హక్కు ఉంది, ”అని ముకేష్ అంబానీ అన్నారు, 
 

click me!