నేడు ప్రారంభంకానున్న ఆర్‌బిఐ ఎం‌పి‌సి సమావేశం.. పాలసీ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు..

First Published Dec 6, 2021, 11:53 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరి పాలసీ కమిటీ (MPC) సమావేశం నేటి నుండి ప్రారంభమైంది అలాగే బుధవారం అంటే డిసెంబర్ 8న  మానిటరి పాలసీ కమిటీ ఫలితాలను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేస్తుంది. 

 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఎంపీసీ సమావేశంలో పాలసీ రేట్లలో మార్పులతో సహా పలు ఆర్థిక నిర్ణయాలను సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. సమావేశానికి ముందు ఎస్‌బిఐ రీసెర్చ్‌తో సహా చాలా మంది ఆర్థికవేత్తలు ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని సూచించారు. ఎస్‌బి‌ఐ రీసెర్చ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ, "కొవిడ్ -19 కొత్త వేరియంట్  వల్ల పెరుగుతున్న ప్రమాదం కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు మరింత సమయం కావాలి అని అన్నారు.

అలాగే సంస్కరణలు ఊపందుకున్నాయి, అయితే రుణ వడ్డీ రేట్లు ఇంకా కాపిటల్ లెవెల్స్  నిర్వహించాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 8న వచ్చే నిర్ణయాలు రివర్స్ రెపో రేటును కొనసాగించాలి, తద్వారా మార్కెట్  కాపిటల్ అవసరాన్ని తీర్చవచ్చు. నవంబర్‌లో అదనపు లిక్విడిటీ రూ.7.6 లక్షల కోట్లుగా ఉంది. 

తక్కువ రెపో రేటు కారణంగా ఒకరోజు డిపాజిట్ల స్థాయి 3.4 లక్షల కోట్ల నుంచి 2.6 లక్షల కోట్లకు తగ్గింది. కోటక్ ఎకనామిక్ రీసెర్చ్ కూడా ఫిబ్రవరిలో రివర్స్ రెపో రేటును, సెప్టెంబర్ తర్వాత రెపో రేటును పెంచాలని సూచించింది. 

పాలసీ రేట్లు మార్పుపై తక్కువ అవకాశం 
నిపుణులను విశ్వసిస్తే ఈ మూడు రోజుల సమావేశ ఫలితాలు డిసెంబర్ 8న వెలువడతాయి. అయితే ఈసారి పాలసీ రేట్లలో ఎటువంటి మార్పుకు అవకాశం ఉండకపోవచ్చు. అంటే రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని అంచనా. కొత్త ఒమిక్రాన్  (Omicron)వేరియంట్ వైరస్ సోకిన  కేసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో కనుగొనబడ్డాయి అయితే తాజాగా భారతదేశం కూడా దీని బారిన పడినట్లు గమనించాలి. అయితే ఆర్‌బిఐ పాలసీ రేట్లలో కొన్ని మార్పులు చేయవచ్చని ఆర్థిక సలహాదారులను ఉటంకిస్తూ కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. 
 

ఎం‌పి‌సి సమావేశాలలో 
కరోనా కాలంలో పాలసీ రివ్యూ ఎనిమిది సార్లు జరిగింది. ఈ సమావేశాల తర్వాత ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఎంపీసీ సమావేశం ఈ ఏడాది చివరిది కావడంతో ఓమిక్రాన్ సహా పలు అంశాలపై లోతుగా చర్చించనున్నారు. 

ఈ అంశాలపై చర్చించనున్నారు
నివేదిక ప్రకారం రెపో రేట్లలో మార్పులతో పాటు ఈ సమావేశంలో ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని కొనసాగించాల్సిన అవసరంపై దృష్టి పెట్టనుంది అయితే ద్రవ్యోల్బణ రేట్లలో హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని సమావేశ నిర్ణయాలు కూడా తీసుకోబడతాయి. అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో ద్రవ్య విధాన కమిటీ FY21కి GDP వృద్ధి అంచనాను 9.5 శాతం వద్ద ఉంచింది.

click me!