బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. పరిమితికి మించే చార్జీలు బాదుడే.. ఎంతంటే ?

First Published Dec 7, 2021, 12:19 PM IST

వచ్చే నెల నుండి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ బ్యాంక్ కస్టమర్‌లు (bank customers)వారి సొంత బ్యాంకు  ఏ‌టి‌ఎంల నుండి డబ్బు విత్‌డ్రా(cash withdraw) చేసుకునే పరిమితికి మించితే అదనపు ఛార్జీలు భారం పడనుంది.

 క్యాష్ విత్‌డ్రా లిమిట్ దాటిన తర్వాత ఏ‌టి‌ఎం లావాదేవీల కోసం వినియోగదారులు జనవరి 2022 నుండి   అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఖాతాదారులకు మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసేందుకు బ్యాంకులు ఇప్పటికే తెలియజేస్తున్నాయి. ప్రతి నెల ఫ్రీ లిమిట్ మించి ఏ‌టి‌ఎం క్యాష్ విత్‌డ్రాల పై ఛార్జీలను పెంచడానికి  ఆర్‌బి‌ఐ బ్యాంకులను అనుమతించినందున ఏ‌టి‌ఎం లావాదేవీలు సామాన్యులకు మరింత భారంగా  మారాయి.

ఈ మార్పు అమలులోకి వచ్చిన తర్వాత పరిమితికి మించి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఖాతాదారులు ఏటీఎం నుండి ఒక్కో లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి బ్యాంకు ఖాతాదారులు రూ.20 చెల్లిస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్  ఖాతాదారులకు వారి స్వంత బ్యాంకుల ఏ‌టి‌ఎం నుండ ఐదు ఉచిత లావాదేవీలను చేయడానికి అనుమతిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం కొత్త నియమం 1 జనవరి 2022 నుండి అమలులోకి వస్తుంది. అయితే డెబిట్ కార్డ్‌లు ఉన్న కస్టమర్‌లు నెలకు వారి స్వంత బ్యాంకుల ఏ‌టి‌ఎంలలో ఐదు ఉచిత లావాదేవీలకు అర్హులు. అదనంగా మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల నుండి మూడు ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో నగరాల్లో ఐదు ఉచిత లావాదేవీలకు అర్హులు. ఈ మార్పుల గురించి ఈ ఏడాది జూన్‌లో ఆర్‌బీఐ నోటిఫై చేసింది.

ఏ‌టి‌ఎం లావాదేవీల గురించి ఆర్‌బి‌ఐ ఏం చెప్పిందంటే ?

“కస్టమర్‌లు వారి సొంత బ్యాంకు ఏ‌టి‌ఎంల నుండి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలకు అర్హులు. అలగీ ఇతర బ్యాంక్ ఏ‌టి‌ఎంల నుండి మెట్రో సెంటర్లలో మూడు లావాదేవీలు, నాన్-మెట్రో సెంటర్లలో ఐదు లావాదేవీలు చేసుకోవచ్చు. ఉచిత లావాదేవీలు కాకుండా 14 ఆగస్టు 2014 నాటి సర్క్యులర్ DPSS.CO.PD.No.316/02.10.002/2014-2015 ప్రకారం ప్రతి లావాదేవీకి కస్టమర్ ఛార్జీలపై సీలింగ్ / క్యాప్ రూ. 20. అయితే బ్యాంకులకు పరిహారం చెల్లించడానికి హై ఇంటర్‌చేంజ్ చార్జ్ అండ్ సాధారణ ఖర్చుల పెరుగుదల కారణంగా ప్రతి లావాదేవీకి కస్టమర్ ఛార్జీలను రూ. 21కి పెంచడానికి ఆర్‌బి‌ఐ అనుమతించింది. ఈ పెంపు 1 జనవరి 2022 నుండి అమలులోకి వస్తుంది" అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 జూన్ 2021 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొంది.

"క్యాష్ రీసైక్లర్ మెషీన్‌లలో (నగదు డిపాజిట్ లావాదేవీలు కాకుండా) చేసే లావాదేవీలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయి, ఈ మొత్తంపై అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

 కొత్త రూల్ గురించి కస్టమర్లకు 

హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా కొన్ని బ్యాంకులు కొత్త నోటిఫికేషన్‌తో వాటి వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేశాయి.

“1 జనవరి 2022 నుండి ఏ‌టి‌ఎం లావాదేవీల ఛార్జీలు ఉచిత పరిమితిని మించితే రూ. 21 చార్జ్ చేయనుంది" అని హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది.

“హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎమ్‌లలో నగదు ఉపసంహరణ లావాదేవీలపై మాత్రమే ఈ ఛార్జీలు పరిగణించబడతాయి. నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ & పిన్ మార్పు ఉచితం.  

యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, “1 జనవరి 2022 నుండి యాక్సిస్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంక్ ఏ‌టి‌ఎంలలో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలపై  చార్జ్ రూ.21 అలాగే జి‌ఎస్‌టి ​​ఉంటుంది.”

దీనికి ముందు ఆర్‌బిఐ చివరిసారిగా ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఆగస్టు 2021లో లావాదేవీల పరిమితిని పెంచింది. ఏ‌టి‌ఎం లావాదేవీల కోసం ఇంటర్‌చేంజ్ ఫీజు చివరి మార్పు ఆగస్ట్ 2012లో జరిగింది, అయితే కస్టమర్‌లు చెల్లించాల్సిన ఛార్జీలు చివరిసారిగా ఆగస్టు 2014లో సవరించబడ్డాయి. ఈ ఫీజులను చివరిగా మార్చినప్పటి నుండి చాలా సమయం గడిచిపోయింది అని బ్యాంక్ పేర్కొంది.

click me!