Best Low Price cars: ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ ఇచ్చే చవక కార్లు ఇవిగో, వీటిని కొనడం సులువు

Published : Nov 03, 2025, 01:08 PM IST

Best Low Price cars: మనదేశంలో కార్ల ధరలు చాలా తగ్గాయి.  తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ కారు గురించి ఇచ్చాము. కారు కొనాలనుకునే వారు మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లతో కూడిన చవక కార్ల గురించి తెలుసుకోండి.

PREV
16
బడ్జెట్ లో చవకైన కార్లు

సొంత కారు కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే కార్లు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ ఇచ్చాము. బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఉంటే కార్లు ఇవిగో. మనదేశంలో తక్కువ ధరలో మంచి మైలేజ్, తక్కువ నిర్వహణతో, ఆధునిక ఫీచర్లతో ఉండే కార్లు ఏవో తెలసుకోండి.

26
టాటా టియాగో

టాటా టియోగో కారు అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇది భద్రత, సౌకర్యాన్ని కూడి ఉంటుంది.  టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ.4.57 లక్షల నుంచే మొదలవుతుంది. దీని  మైలేజీ కూడా ఎక్కువ.  లీటరు పెట్రోల్‌ కు 20 కి.మీ, సీఎన్‌జీపై 27 కి.మీ మైలేజీ ఇస్తుంది. విశాలమైన క్యాబిన్, ఆధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉంటాయి. బిగినర్లు కూడా ఈ కారును నడిపించగలరు.

36
మారుతి సుజుకి ఆల్టో కె10

మనదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు ఇది.  చవకగా ఉండే కార్లలో  ఇదీ ఒకటి.  అందులో ఆల్టో K10 కారు కూడా ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.69 లక్షల నుంచి మొదలవుతుంది. 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారు 24.5 కి.మీ మైలేజీ వస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ దీని ప్రత్యేకతలు.

46
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారు పొడవుగా, విశాలమైన ఇంటీరియర్‌తో వస్తుంది. దీని ధర రూ.4.99 లక్షల నుంచి మొదలవుతుంది. సుమారు ఇది సీఎన్ జీ పై  34 కి.మీ మైలేజీ ఇస్తుంది. స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ దీని ప్రత్యేకతలు. రోజూ ప్రయాణాలు చేసేవారికి ఈ కారు మంచి ఆప్షన్.

56
మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి సెలెరియో కారు చాలా తక్కువ ధరకే వస్తుంది.  పెట్రోల్‌పై లీటరుకు 26 కి.మీ, సీఎన్‌జీపై 34 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ సెలెరియో ధర రూ.4.69 లక్షల నుంచి మొదలవుతుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్, స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

66
రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ చూసేందుకు ఎస్‌యూవీ లుక్ తో వస్తుంది. దీనిలో ఆధునిక ఫీచర్లు ఉంటాయి. ఈ క్విడ్ కారు 999 సీసీ ఇంజన్‌తో స్మూత్ డ్రైవింగ్ అందిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.4.29 లక్షలతో మొదలవుతుంది.  ఇది లీటరు పెట్రోల్ కు 22 కి.మీ మైలేజీ ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories