పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టి ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకానికి 8.2% వార్షిక వడ్డీ రేటు అమల్లో ఉంది. వడ్డీని త్రైమాసికం (మూడు నెలలకు ఒకసారి) చెల్లిస్తారు. ఉదాహరణకు, మీరు రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే, సంవత్సరానికి సుమారు రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. అంటే ప్రతి 3 నెలలకు రూ. 61,500 వడ్డీ అందుతుంది. ఇలా చూసుకుంటే.. నెలకు సగటున రూ. 20,500 స్థిర ఆదాయం లభిస్తుంది.