స్టాక్ మార్కెట్ పరిస్థితి అనేది బంగారపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. స్టాక్ మార్కెట్ పతనమైనా కూడా బంగారం రేటు పెరుగుతూనే ఉంది. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే దీనివల్ల బంగారం డిమాండ్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ బాగా నడిస్తే, బంగారంలో పెట్టుబడులు తగ్గిపోతాయి. అప్పుడు ధరలు కూడా తగ్గుతాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతాయి.
భారతదేశంలో బంగారం అనేది ఒక సాంప్రదాయ పెట్టుబడిగా భావిస్తారు. పెళ్లిళ్ల సీజన్, పండుగలు, దీపావళి, ఆషాడ మాసం వంటి సమయాల్లో బంగారం కచ్చితంగా పెరుగుతుంది. దీనివల్ల కూడా ధరలు పెరుగుతాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లేదా ఇతర సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తుండడంతో , మార్కెట్లో బంగారం కొరత ఏర్పడుతుంది.