మన తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి వారే ఎక్కువ. ట్రావెలింగ్‌కి ప్రతి ఒక్కరూ లక్షల్లో ఖర్చు పెట్టలేరు. చాలా తక్కువ బడ్జెట్ తోనే ట్రావెలింగ్ చేయాలనుకుంటారు. పదివేల రూపాయలతోనే హైదరాబాదు నుండి చూడదగ్గ కొన్ని ప్రదేశాలను ఇక్కడ ఇచ్చాము.
ఏడాదికి ఒకసారి ఏదైనా ట్రిప్‌కు వెళ్లాలని ప్రతి ఫ్యామిలీ కోరుకుంటుంది. కానీ ఆర్థిక సమస్యలు వారిని వెళ్లకుండా అడ్డుకుంటాయి. లక్షల ఖర్చుపెట్టి వెళ్లడం అందరి తరం కాదు. హైదరాబాదులో ఉన్న వారు కేవలం 10,000 రూపాయల బడ్జెట్‌తోనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వీలైన కొన్ని ట్రావెల్ స్టేషన్ ల గురించి ఇక్కడ ఇచ్చాము. ఈ ట్రావెల్స్ స్పాట్లు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు ఉత్తమమైనవి కూడా. పదివేల రూపాయలలోపే ఖర్చు అవుతాయి. కాబట్టి ఏడాదికి ఒక 10,000 రూపాయలు ట్రావెలింగ్ కోసం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఎలాంటి ప్రదేశాలను హైదరాబాద్ నుంచి చూడవచ్చో తెలుసుకోండి.
25
గుల్బర్గా
దీనిని కలబురిగి అని కూడా పిలుస్తారు. ఇది ఎంతో గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందింది. హైదరాబాదు నుండి 212 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందూ, ముస్లింలు అందరూ కలిసి ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ ఈ రెండు మతాలకు చెందిన నిర్మాణాలు అద్భుతంగా ఉంటాయి. గుల్బర్గాలో చూడవలసిన ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సాంస్కృతిక వారసత్వ సంపదలు అద్భుతమైన ప్రదేశాలకు ఇది కేరాఫ్ అడ్రస్. మీరు హైదరాబాదు నుంచి బయలుదేరితే మూడు గంటల 15 నిమిషాలలో చేరుకుంటారు. పదివేల రూపాయలు కూడా దీనికి ఖర్చు కాకపోవచ్చు. ఇంకా డబ్బులు మిగిలే అవకాశం కూడా ఉంది.
35
నాందేడ్
మహారాష్ట్రలో ఉన్న ఒక అద్భుతమైన పట్టణం నాందేడ్. ఈ పర్యాటక ప్రదేశాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. ఎన్నో ప్రాంతాలు ఇక్కడ పర్యాటకంగా కొలువుదీరి ఉన్నాయి. గురుద్వారాలు, హిందూ దేవాలయాలు, చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోయిన శిధిలమైన కోటలు... ఇలా ఎంత చెప్పినా తక్కువే. నాందేడ్లో ఫుడ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హైదరాబాదు నుండి 232 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు రెండు రోజుల పాటు అక్కడ ఉన్నా కూడా పదివేల రూపాయలు మాత్రమే అవుతుంది.
45
లాతూర్
మహారాష్ట్రలోని ఒక ప్రసిద్ధి చెందిన నగరాల్లో లాతూర్ ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని ముంబై నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాదు నుంచి 298 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్రాఫిక్ హడావిడికి దూరంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశం ఇది. విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఇది అద్భుతమైన డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. చరిత్రపై ఆసక్తి ఉంటే ఖరోసా గుహలు, ఔసా కోట వంటివి చూడవచ్చు. అలాగే వన్యప్రాణులను చూసేందుకు ఎన్నో పార్కులు కూడా చూడవచ్చు. శీతాకాలంలో లాతూర్ ప్రాంతానికి వెళితే అద్భుతంగా ఉంటుంది.
55
బీజాపూర్
దక్షిణ భారతదేశంలో ఉన్న చారిత్రక సంపదలకు నిలయం బీజాపూర్. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అద్భుతమైన వాస్తు శిల్పానికి బీజాపూర్ కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది. ఇబ్రహీం ఔజా, జుమ్మా మసీద్, గోల్ గుమ్మజ్ వంటి ప్రవేశ ప్రదేశాలను చూడవచ్చు. ఇప్పటికీ రాజులు, సుల్తానుల అవశేషాలు ఆ నగరం చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ నగరం అసలు పేరు విజయపుర ఇప్పుడు బీజాపూర్ గా మారిపోయింది.