Gold loan: బంగారంపై అతి తక్కువ వడ్డీతో రుణాలిచ్చే బ్యాంకులు ఇవిగో

Published : Oct 08, 2025, 06:49 PM IST

బంగారం విలువ పెరిగిపోయింది. లోన్ కోసం బంగారం (Gold loan) బ్యాంకులో పెట్టి రుణం తీసుకునేవారు ఎక్కువే ఉన్నారు. అయితే మనదేశంలో తక్కువ వడ్డీకి బంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి. మీకు బంగారం లోన్ కావాలంటే ఈ బ్యాంకులకు వెళ్లండి

PREV
17
బంగారంపై లోన్

బంగారం రేటు చాలా పెరిగిపోతోంది. అవసరానికి బంగారాన్ని అమ్మే బదులు వాటిని బ్యాంకులో పెట్టి రుణం తీసుకోవడం ఉత్తమం. మనదేశంలో ఎన్నో బ్యాంకులు బంగారు రుణాలు అందిస్తున్నాయి.   సెంట్రల్ బ్యాంక్, పీఎన్‌బీ, ఎస్‌బీఐ వంటి బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్నాయి.  2025లో బంగారంపై రుణాలు రికార్డు స్థాయిలో తీసుకుంటున్నారు.

27
బంగారం ధర పెరగడంతో

2025లో బంగారం ధర ఏకంగా 44 శాతం పెరిగింది. బంగారం పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.  ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొనడం, యూఎస్ ఫెడ్ రేట్లలో కోత, ప్రపంచం దేశాల్లో ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారం ధర విపరీతంగా పెరిగిపోతోంది. 

37
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.05%  నుంచి 8.35% వడ్డీతో రూ.10,000 నుంచి రూ.40 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.

47
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరువాత రెండో స్థానంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నిలిచింది. ఈ బ్యాంకు బంగారంపై రుణాలను 8.20 శాతం నుంచి 11.60 శాతం వరకు అందిస్తుంది. బంగారంపై రూ.25,000 నుంచి రూ.50 లక్షల వరకు 12 నెలల కాలానికి రుణాన్ని పొందవచ్చు.

57
పంజాబ్ నేషనల్ బ్యాంక్

ఇక మూడో స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నిలిచింది. ఈ బ్యాంకు 8.35 శాతం నుంచి వడ్డీరేట్లు మొదలవుతాయి. మీరు  రూ.25,000 నుంచి రూ.25 లక్షల వరకు 12 నెలల కాలానికి రుణాన్ని తీసుకోవచ్చు.

67
బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇక నాలుగో స్థానంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నిలిచింది. ఈ బ్యాంకు 8.60 శాతం నుంచి 8.75 శాతం వడ్డీతో బంగారం పై రుణాలను అందిస్తుంది.  ఇందులో భాగంగా బంగారంపై ఈ బ్యాంకు రూ.20,000 నుంచి రూ.30 లక్షల వరకు 12 నెలల కాలానికి రుణం తీసుకోవచ్చు.

77
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇక ఐదో స్థానంలో నిలిచిన బ్యాంక్… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).  ఈ బ్యాంక్ 8.75 శాతం నుంచి బంగారంపై రుణాలు మొదలవుతాయి. 36 నెలల కాలానికి రూ.20,000 నుంచి రూ.50 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories