రూ.3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు (Range Rover car) కొనాలంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండాలని అనుకుంటారంతా. కానీ హెయిర్ సెలూన్ పెట్టుకుని ఎదిగిన ఒక వ్యక్తి ఈ కారు కొనుగోలు చేశారు. అతను బెంగళూరుకు చెందిన సంపన్న బార్బర్ రమేష్ బాబు.
బెంగళూరుకు చెందిన క్షురకుడు రమేష్ బాబు. ఇతడు బార్బర్ గా దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందాడు. బార్బర్ అయినప్పటికీ బెంగళూరులోని సంపన్నుల జాబితాలో రమేష్ బాబు స్థానం సాధించారు. ప్రస్తుతం రమేష్ బాబు కేవలం బార్బర్ పనే కాదు పలు వ్యాపారాలు చేస్తున్నారు. వాటిలో లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఒకటి. ఆ వ్యాపారాల్లో అతనికి విపరీతంగా డబ్బు కలిసివచ్చింది. ఇతనికి లగ్జరీ కార్లను కొనడం అలవాటు. ఇప్పటికే లగ్జరీ కార్ల కలెక్షన్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు దానికి మరో కారు తోడైంది. ఏకంగా రూ.3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును అతను కొనుగోలు చేశారు.
26
రేంజ్ రోవర్ LWB
రమేష్ బాబు రేంజ్ రోవర్ LWB కార్ ను కొనుగోలు చేశారు. దీని ధర అక్షరాలా రూ.3.2 కోట్ల రూపాయలు. ఇది 346 bhp పవర్, 700 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. కేవలం 6.4 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకునే శక్తిని కలిగి ఉంటుంది.
36
విలాసవంతమైన కార్లు అద్దెకు
రమేష్ బాబు టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారంలో అన్ని విలాసవంతమైన కార్లు అద్దెకు అందుబాటులో ఉన్నాయి. రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ మేబ్యాక్, మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్, రేంజ్ రోవర్, BMW సహా అనేక లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా బస్సులతో సహా అన్ని రకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
రమేష్ బాబు తండ్రి బార్బర్‌గా పనిచేసేవారు. రమేష్ కు 7 ఏళ్ల వయసులో ఆయన తండ్రి మరణించారు. దాంతో రమేష్ తల్లి పలు ఇళ్లలో పనిచేసి పిల్లల్ని పెద్ద చేశారు. రమేష్ బాబు కూడా పనిచేసుకుంటూనే పాఠశాల విద్యను పూర్తి చేశారు. కానీ కాలేజీ ముఖమే చూడలేదు. ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
56
బార్బర్‌గా మారి
తండ్రి బాటలోనే బార్బర్ వృత్తిని ఎంచుకున్నాడు రమేష్ బాబు. కుటుంబ పోషణ మొత్తం దీని మీదే పడింది. బార్బర్ వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సాధించారు రమేష్ బాబు. కష్టపడి ఆయన ఎదిగారు. మంచి సంపాదన రావడంతో అప్పు చేసి మరి మారుతి సుజుకి ఓమ్ని కారును మొదట కొన్నారు. దాన్ని అద్దెకు ఇచ్చి తిప్పడం మొదలుపెట్టారు.
66
లగ్జరీ కార్లు కొని
రమేష్ బాబు ఓమ్ని కారుతోనే మంచి ఆదాయాన్ని పొందడంతో వ్యాపారాన్ని విస్తరించారు. దాంతో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో దీన్ని ప్రారంభించారు. అప్పు చేసి మరీ కొన్ని కార్లు కొన్నారు. క్రమంగా రోల్స్ రాయిస్, మెర్సిడెస్ వంటి ఖరీదైన కార్లు వచ్చి చేరాయి. దీంతో రమేష్ బాబుకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.