ధరలు పెరిగే వస్తువులివే :
కొన్ని వస్తువులపై ధరల పెంపుకు జిఎస్టి ప్యానల్ రికమెండ్ చేస్తోంది. కొన్ని రకాల శీతల పానియాలతో పాటు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జిఎస్టి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై 28 శాతంగా వున్న జిఎస్టిని 35 శాతానికి పెంచాలని జిఎస్టి ప్యానల్ రికమెండ్ చేస్తోంది. ఈ మేరకు బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన సమావేశమైన జివోఎం నిర్ణయం తీసుకుంది.
వీటితోపాటు రెడిమేడ్ గార్మెంట్స్, సైకిళ్లు, రిస్ట్ వాచెస్ పై కూడా ట్యాక్స్ రివిజన్ చేయాలని సూచించారు. అంటే రూ.1,500 లోపు గార్మెంట్స్ పై 5 శాతం, ఆపై విలువగల రెడీమేడ్ గార్మెంట్స్ పై 18 నుండి 28 శాతం జిఎస్టి పెంచాలని రికమండ్ చేసారు.ఇలా కొత్తగా 148 ఉత్పత్తులపై పన్ను పెంచాలని జివోఎం సూచించింది.