డిసెంబర్ వస్తూనే గుడ్ న్యూస్ తెచ్చింది.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు, ఎంతో తెలుసా?

Published : Dec 01, 2025, 10:45 AM IST

దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఎంతుందో తెలుసా? 

PREV
15
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

LPG Gas Cylinder Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించేందుకు చమురు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. కానీ చాలా నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రతి నెలా అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం నిర్ణయిస్తారు.

25
గత రెండు నెలలుగా తగ్గుతున్న గ్యాస్ సిలిండర్

సాధారణంగా చమురు కంపెనీ ప్రతినెలా 1వ తేదీన ధరలను సమీక్షిస్తాయి... అప్పటి పరిస్థితులను బట్టి పెంచాలా? తగ్గించాలా? అన్నది నిర్ణయిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ 1న చివరగా చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధర పెంచాయి. తర్వాత రెండు నెలలు తగ్గించింది. నవంబర్‌లో రూ.4.50 తగ్గించగా డిసెంబర్ లో రూ.10 తగ్గించింది. ఈ తగ్గింపు రాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. 

35
డొమెస్టిక్ సిలిండర్ సంగతేంటి?

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గినా గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. గృహ వినియోగ సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.905 కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా ఈ డొమెస్టిక్ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. సామాన్య ప్రజలపై ప్రభుత్వం మరింత మోపేందకు ఇష్టపడటంలేదు... ఇదే సమయంలో సిలిండర్ ధర తగ్గించి ఊరట కూడా కల్పించడంలేదు.

45
తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర

హైదరాబాద్ లో రూ.905

విజయవాడలో రూ.875

గుంటూరు రూ.877

విశాఖపట్నం రూ.861

55
తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ పై సబ్సిడి

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో పేద, మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ వినియోగం భారంగా మారకూడదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి... ఇందుకోసమే గ్యాస్ సిలిండర్ పై సబ్సిడి అందిస్తున్నాయి. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు సబ్సిడిపై అందిస్తున్నారు... కేవలం రూ.500 కే సిలిండర్ లభిస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకం కింద పేద కుటుంబాలకు ఉచితంగానే గ్యాస్ సిలిండర్స్ అందిస్తోంది. అర్హత కలిగినవారికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు... ప్రతి నాలుగు నెలలకు ఓసారి ఉచిత సిలిండర్ పొందవచ్చు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ కలిగిన పేద కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.

Read more Photos on
click me!

Recommended Stories