Ambani Family: దేశంలోని అత్యంత సంపన్న కుటుంబం ముఖేష్ అంబానీ ఫ్యామిలి. వారి జీవనశైలి గురించి తెలుసుకునేందుకు ప్రజలంతా ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్య అంబానీ ఫ్యామిలీ ఫిట్‌నెస్ ట్రైనర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
మనదేశంలోనే కాదు ఆసియాలోనే ధనిక కుటుంబం ముఖేష్ అంబానీ ఫ్యామిలి. వాళ్ల ఇంట్లో చిన్న వేడుక కూడా ప్రపంచాన్ని ఆకర్షించేంత వైభవంగా జరుగుతుంది. అయితే ముఖేష్ అంబానీ కుటుంబానికి వంటవాళ్ల నుంచి ఫిట్ నెస్ ట్రైనర్ల వరకు ఎంతో ఆచితూచి ఎంపిక చేసుకుంటారు. అలా ఇప్పుడు ఆ కుటుంబం ఫిట్ నెస్ ట్రైనర్ ఎవరా అని ఎంతో మంది సెర్చ్ చేస్తున్నారు. ఆయన పేరు వినోద్ చన్నా. ఒకప్పుడు అనంత్ అంబానీ భారీగా బరువు తగ్గడం వెనుక ఉన్నది కూడా ఈయనేనని అంటారు. నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు ప్రస్తుతం ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నట్టు సమాచారం.
25
ఎందుకు జిమ్ ట్రైనర్ అయ్యారు?
కానీ వినోద్ చన్నా ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభంగా కాలేదు. చిన్నప్పుడు వినోద్ చాలా సన్నగా ఉండేవాడట. అతడి శరీరాన్ని చూసి స్కూల్లో, కాలేజీలో అందరూ ఆటపట్టించేవారట. ఆ బాధతోనే అతను ఫిట్ గా ఉండేందుకు ప్రయ్నతించడం మొదలుపెట్టాడు. మొదట చిన్న జిమ్‌లలో ట్రైనింగ్ తీసుకుని తన శరీరాన్ని బలిష్టంగా మార్చుకున్నాడు. తర్వాత ఫిట్‌నెస్‌పై పూర్తిగా శ్రద్ధ పెట్టి దాన్నే వృత్తిగా మార్చుకున్నాడు. ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి అతడు మంచి ట్రైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
35
ఎంతో మంది సెలెబ్రిటీలకు ట్రైనర్
వినోద్ చన్నా పక్కాగా ప్లాన్ చేసిన వర్కౌట్ రొటీన్స్‌కు, సమతుల్య ఆహార ప్రణాళిక సిద్ధం చేస్తాడు. అంబానీలకే కాదు జాన్ అబ్రహాం, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఇతడి దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటారు. వీరందరికీ వారి శరీరాలు, వారి ఆరోగ్య అవసరాలకు తగ్గట్టు డైట్ ప్లాన్స్, వర్కౌట్ రొటీన్స్ సిద్ధం చేసి ఇస్తాడు. ఒక్కో సెలెబ్రిటీకి ఒక్కరికొక రకమైన ప్లాన్ తయారు చేయడం ఇతడి స్పెషాలిటీ. అందుకే అతని క్లయింట్లు చాలా సంతోషంగా ఉంటారు.
వినోద్ చన్నా ముంబైలో తన సొంత ఫిట్‌నెస్ స్టూడియో పెట్టుకున్నాడు. అక్కడ్నించ తన క్లయింట్లకు ట్రైనింగ్ అందిస్తున్నాడు. ఆయన ట్రైనింగ్ కోసం తీసుకునే ఛార్జీలు కూడా అధికంగా ఉంటాయని అంటారు. అలాగే ఫలితాలు కూడా అంతే విలువైనదిగా ఉంటుందని చెబుతారు. వినోద్ చన్నా చాలా సాధారణ కుటుంబంలో పుట్టాడు. తన కష్టంతోనే దేశంలో అత్యంత ఖరీదైన ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఎదిగాడు.
55
నెలకు ఎంత ఛార్జ్ ?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాడ్‌కాస్ట్‌లో వినోద్ తన ఫీజు వివరాలు వివరించారు. ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇచ్చేందుకు అతను 12 సెషన్లకు గానూ లక్ష రూపాయలు తీసుకుంటారు. పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుంటారు. అంబానీల దగ్గర ఇంతకన్నా ఎక్కువ నెల జీతంగా పొందుతున్నట్టు తెలుస్తోంది. అంబానీల ఫ్యామిలీలో ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చినా నెలకు పదిలక్షల రూపాయల దాకా సంపాదించే అవకాశం ఉంది వినోద్ చన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.