Storage Tips: జీమెయిల్‌ స్టోరేజ్ నిండిపోయిందా? ఇలా చేస్తే అవసరం లేని మెయిల్స్ ఒకేసారి డిలీట్ అయిపోతాయి

Storage Tips: ఈ కాలంలో ఎంప్లాయిస్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. జీమెయిల్ స్టోరేజ్ నిండిపోయి మెయిల్స్ రాక ఇబ్బంది పడుతుంటారు. అనవసర మెయిల్స్ తో స్టోరేజ్ అంతా నిండిపోతుంది. అలాంటి వాటిని అన్నీ ఒకేసారి ఎలా డిలీట్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి. స్టోరేజ్ పెంచుకోండి.

ఈ రోజుల్లో ఏదైనా సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా, బిల్ పే చేసినా, జాబ్స్ లాంటి వాటికి అప్లై చేసినా ఈ-మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి వస్తోంది. ఇది కాకపోయినా కనీసం ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఫోన్ నంబర్, ఆధార్ లాంటి వివరాలు ఇస్తే దానికి లింక్ అయి ఉన్న ఈ-మెయిల్, పాన్, ఫోన్ నంబర్లు, అకౌంట్ డీటైల్స్ ఇలా ఏదైనా సంపాదించవచ్చు. అలా మన అనుమతి లేకుండానే కొన్ని కంపెనీలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు మనకు ఈ-మెయిల్స్ పంపిస్తుంటాయి. 

ఇలాంటి వాటి వల్ల జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోతుంది. యాడ్ ఈమెయిల్స్, న్యూస్ లెటర్స్, రసీదులు ఇలా చాలా ఈమెయిల్స్ పేరుకుపోతాయి. ప్రతి మెయిల్ కి గూగుల్ 15 జీబీ ఫ్రీ స్టోరేజ్ ఇస్తుంది. కాని అది ఎప్పుడూ చాలదు. అనవసరపు మెయిల్స్ వస్తూనే ఉంటాయి. అందుకే ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉండాలి. కానీ ఒక్కోటి డిలీట్ చేస్తే గంటలు పడుతుంది. అందుకే ఈమెయిల్స్‌ను ఒకేసారి డిలీట్ చేసే ఆప్షన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. 

ఇది కూడా చదవండి నెట్‌ఫ్లిక్స్‌లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన సినిమాలు, వీడియోలే ఎలా వస్తున్నాయో తెలుసా?


జిమెయిల్ టిప్స్

జీమెయిల్ స్టోరేజ్ నిండిపోతే మెయిల్స్ డిలీట్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి.

1. లాగిన్ అయి Gmail ఓపెన్ చేయండి. 

2. inboxలోకి వెళ్లండి. 

ప్రైమరీ/సోషల్/ప్రోమోషన్స్ ట్యాబ్‌లోకి వెళ్లండి.

పేజీ పైభాగంలో "Select All" (✓) బాక్స్ పై క్లిక్ చేయండి.

"Select all conversations in this folder" అనే ఆప్షన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి.

3. పై భాగంలో Trash/Delete ఐకాన్ పై క్లిక్ చేయండి.

4. Trash ఫోల్డర్ లోకి వెళ్లి Empty Trash Now క్లిక్ చేయండి.
 

ఒకేసారి ఈమెయిల్స్ డిలీట్

జీమెయిల్ లో అనవసర మెయిల్స్ డిలీట్ చేయడానికి రెండో పద్ధతి ఏంటంటే..

బ్రౌజర్‌లో జీమెయిల్ ఓపెన్ చేయండి.

ఇన్‌బాక్స్‌పై క్లిక్ చేయండి.

పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్‌లో 'Unsubscribe' అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి.

అన్ని ప్రమోషనల్ ఈమెయిల్స్ కనిపిస్తాయి.

ఈ ప్రమోషన్ ఈమెయిల్స్‌ను ఒకేసారి డిలీట్ చేయడానికి, పైన ఎడమ మూలలో ఉన్న చిన్న చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి. 'Select all' క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి.

అన్ని ఈ-మెయిల్స్ సెలెక్ట్ అయ్యాక, స్క్రీన్ పైన ఉన్న ట్రాష్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. ప్రమోషన్, సోషల్ ట్యాబ్‌లలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. దెబ్బకి మీ ఇన్ బాక్స్ మొత్తం ఒక్కసారిగా ఫ్రీ అయిపోతుంది. ఎక్కువ స్టోరేజ్ లభిస్తుంది. 

ఇది కూడా చదవండి చాట్ జీపీటీ-4.5 అప్‌డేట్ వచ్చేసింది! ఫీచర్స్ తెలిస్తే ఆశ్యర్యపోతారు

Latest Videos

click me!