Gold Rate Hike: మళ్లీ బంగారం ధరలు భయపెడుతున్నాయి. ఒక్కరోజులో పసిడి యూటర్న్ తీసుకుంది. బంగారం తగ్గిందని సంతోషించేలోపే మరో బాంబ్ వచ్చిపడింది. ఒక్కసారిగా ధరలు ఎగబాకాయి.
కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తూ ఊరట నిచ్చిన బంగారం, వెండి....మళ్లీ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. దీంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులకు షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు అనేవి అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. తాత్కాలిక మార్పుల కారణంగా ధరల మార్పులకు కారణమవుతున్నాయి.
24
మధ్యతరగతి ప్రజలపై భారం
బంగారం, వెండి కొనుగోలు అనేది ఈరోజుల్లో కామన్ అయిపోయింది. కానీ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు బంగారం ధరలు భారంగా మారుతున్నాయి. పసిడి, సిల్వర్ లేనిదే ఏ శుభకార్యం జరగట్లేదు. దీని వల్ల పేద, మిడిల్ క్లాస్ వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సంపాదనే అంతంత మాత్రం ఉంటే..లక్షలు పెట్టి బంగారం కొనలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది.
34
కీలక అలెర్ట్
రెండురోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు చూసి కొనాలని ప్లాన్ చేసుకున్న వారికి ఇదొక కీలక అలెర్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఏ రోజు తగ్గుతుందో, ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి పరిస్థితిని చూసి కొనుగోలు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2940 పెరిగి రూ.1,48,580 కి చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్లపై రూ.2,700 పెరిగి రూ.1,36,200కి చేరింది. బంగారం ధరలు ఇలా ఉంటే వెండి ధరలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. కిలో వెండి ధరపై రూ.5వేలు పెరిగి రూ.2,65,000 వద్ద స్థిరపడింది. పరిశ్రమల డిమాండ్, అంతర్జాతీయ సరఫరా పరిస్థితుల కారంగా హెచ్చుతగ్గులు గురవుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.