బంగారం, వెండి సామాన్యులకు, పెట్టుబడిదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లు ఓపెన్ అయ్యేసరికి ఇన్వెస్టర్లకు చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈసారి పసిడి, సిల్వర్ ధరలకు రెక్కలొచ్చాయి. గత వారం తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. దీంతో అసలు కొనాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు కొనుగోలుదారులు.
23
రూ.2,510 పెరిగిన మేలిమి బంగారం
ఇక మార్కెట్లు గమనిస్తే ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగానే పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.160 పెరగ్గా...ఇవాళ రూ.2,510 పెరిగింది. అంటే రూ.1,48,090కు చేరింది. నిన్న 22 క్యారెట్ల పసిడిపై రూ.150 ఎగబాకి, ఈరోజు రూ.2,300 పెరిగి రూ.1,35,750కు పెరిగింది. ఇక వెండిపై అయితే ఏకంగా రూ.5వేలు పెరిగిపోయింది. నిన్న రూ.15 వేలు తగ్గి పెద్ద ఊరట కల్పించి...ఇవాళ హార్ట్ బ్రేక్ చేసింది. ఇప్పుడు కిలో వెండి రూ.2.50లక్షలుగా ఉంది.
33
షాకిస్తున్న బంగారం, వెండి
మార్కెట్లో బంగారం ధరలు షాకిస్తున్నాయి. రోజుకు రోజుకు సీన్ మారిపోతోంది. దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. గత కొన్ని రోజులుగా అస్థిరంగా ఉన్న పసిడి ధరలు తాజాగా ఒక్కరోజులోనే గణనీయంగా పెరగడం మార్కెట్‌ను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు ఎప్పుడైనా మారే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ధరల మార్పులను జాగ్రత్తగా గమనించడం చాలా ముఖ్యం. నిపుణులను సంప్రదించి కొనుగోలు చేయడం చాలా ఉత్తమం.