Business Idea: చిన్న ఖాళీ స్థలం ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు సంపాదించే సింపుల్ బిజినెస్ ఐడియా

Published : Mar 27, 2026, 06:45 PM IST

Business Idea: కేవలం రూ. 50 వేల పెట్టుబడితో నెలకు లక్షల్లో సంపాదించడం సాధ్యమేనా? సరైన లొకేషన్, మార్కెటింగ్ వ్యూహాలతో టీ బిజినెస్ ద్వారా అద్భుతమైన లాభాలను ఎలా గడించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

PREV
15
తక్కువ పెట్టుబడి - భారీ లాభం

చాలా మంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాల కోసం వెతుకుతుంటారు. అలాంటివారికి టీ, కాఫీ బిజినెస్ ఒక అద్భుతమైన అవకాశం. చాలా మంది దీనిని చిన్న చూపు చూస్తారు. కానీ సరైన పద్ధతిలో చేస్తే ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చని మీకు తెలుసా.

25
పెట్టుబడి - సెటప్

ఒక చిన్న టీ షాపు ప్రారంభించడానికి సుమారు రూ. 50 వేలు పెట్టుబడి సరిపోతుంది. గ్యాస్ స్టవ్, సిలిండర్, ప్రాథమిక వంట పాత్రల కోసం సుమారు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చవుతుంది. మిగిలిన మొత్తాన్ని షాపు అడ్వాన్స్ లేదా ఇతర మెయింటెనెన్స్ కోసం ఉపయోగించవచ్చు.

35
సక్సెస్ సీక్రెట్ - లొకేషన్ ఎంపిక..

వ్యాపారంలో విజయం సాధించాలంటే లొకేషన్ ఎంపిక అత్యంత కీలకం. కేవలం వాహనాల రద్దీ ఉన్న చోట కాకుండా, పాదచారులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో షాపు పెట్టడం వల్ల కస్టమర్లు ఆగి టీ తాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పార్కింగ్ సమస్య ఉన్న చోట కస్టమర్లు ఆగడానికి ఇష్టపడరని గమనించాలి.

45
ఆదాయ అంచనా..

రోజువారీ విక్రయాల ఆధారంగా లాభాలను ఇలా లెక్కించవచ్చు. ఒక కప్పు టీ ధర సగటున రూ. 15 అనుకుంటే.. రోజుకు 2,000 కప్పులు అమ్మగలిగితే, రోజువారీ టర్నోవర్ రూ. 30 వేలు అవుతుంది. అన్ని ఖర్చులు (రా మెటీరియల్, నిర్వహణ) పోనూ రోజుకు రూ. 20 వేలు లాభం అనుకున్నా, నెలకు రూ. 6 లక్షల రెవెన్యూ జనరేట్ చేయవచ్చు. ఒకవేళ రోజుకు 1,000 కప్పులు అమ్మినా నెలకు రూ. 3 లక్షలు, కేవలం 500 కప్పులు అమ్మినా రూ. 1.5 లక్షల వరకు సంపాదించవచ్చు.

55
మార్కెట్ అనాలసిస్ ముఖ్యం..

వ్యాపారం ఏదైనా నిరంతర అభ్యాసం.. మార్కెట్ అనాలిసిస్ చాలా ముఖ్యం. కేవలం వినడమే కాకుండా, నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టడం ద్వారా ఎవరైనా సక్సెస్ ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు. మీరూ ఓసారి ట్రై చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories