Gold Prices : అమెరికా దెబ్బతో బంగారం ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్‌తో డాలర్, క్రూడాయిల్ మధ్య వార్ మొదలైంది. ఇవన్ని కూడా బంగారం పై ప్రభావం చూపుతున్నాయి. మరి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి?
బంగారం ప్రియులకు ఊరట: భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు
గ్లోబల్ మార్కెట్‌లో జరుగుతున్న మార్పులతో బంగారం, వెండి ధరలు కాస్త కిందకు దిగివచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు, గురువారం ఉదయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అసలు మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? హైదరాబాద్, విజయవాడతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి?
25
లోకల్ మార్కెట్‌లో బంగారం లేటెస్ట్ రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గురువారం ఉదయం బంగారం కొత్త రేట్లు ఇలా ఉన్నాయి.. ఆర్నమెంటల్ బంగారం (22 క్యారెట్ల 10 గ్రాములు) ధర రూ. 1,45,090 గా నమోదైంది. అలాగే ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల 10 గ్రాములు) కొనాలనుకునే వారికి రూ. 1,58,280 గా ధర ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, అక్కడ 22 క్యారెట్ల బంగారం రూ. 1,45,240 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 1,58,430 వద్ద ట్రేడ్ అవుతోంది.
35
కిలో వెండిపై రూ. 1,000 తగ్గుదల
బంగారంతో పాటే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై దాదాపు వెయ్యి రూపాయల వరకు తేడా కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడతో పాటు చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,89,900 గా ఉంది. అదే సమయంలో ఢిల్లీలో కిలో వెండి రూ. 2,84,900 గాను, బెంగళూరులో రూ. 2,85,100 గాను కొనసాగుతోంది.
గ్లోబల్ మార్కెట్‌లో ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న పొలిటికల్ టెన్షన్స్ బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్ ధరల మార్పునకు ప్రధాన కారణం. అమెరికా రీసెంట్‌గా ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలపై డిఫెన్సివ్ దాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 2 శాతం పెరిగాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ కాలం ఉంటుందనే భయాలు మార్కెట్‌లో స్టార్ట్ అయ్యాయి.
55
డాలర్ వర్సెస్ గోల్డ్ రేస్
సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా గొడవలు జరిగితే అందరూ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అని బంగారం వైపు చూస్తారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఆయిల్ రేట్లు పెరగడం, ఇన్ఫ్లేషన్ భయాల వల్ల అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ బాగా స్ట్రాంగ్ అయ్యాయి. డాలర్ వాల్యూ పెరగడంతో, ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు కాకుండా డాలర్ వైపు మొగ్గు చూపారు. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.4% తగ్గి 4,438 డాలర్లకు పడిపోయింది.