Gold Rate: మొన్నటివరకు రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా మళ్లీ దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మార్పుల కారణంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ ధరలు ఏ స్థాయిలో పతనమైందంటే..
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఇటీవల ధరలు పెరగడంతో కొనుగోలు వాయిదా వేసుకున్న వారికి కొంత ఊరట లభించినట్టైంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
25
పతనం దిశగా పసిడి
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గి రూ.1,56,930 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆభరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా గణనీయంగా తగ్గి రూ.1,43,850కు చేరింది. గత కొన్ని రోజులుగా పెరుగుదల దిశగా పయనించిన పసిడి ఒక్కసారిగా తగ్గడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది.
35
బంగారం బాటలోనే వెండి
వెండి ధరల్లో అయితే మరింత భారీ పతనం నమోదైంది. దేశీయ మార్కెట్‌లో గ్రాము వెండి ధర రూ.290కి తగ్గింది. దీంతో 10 గ్రాముల వెండి రూ.2,900, 100 గ్రాముల వెండి రూ.29 వేలుగా నమోదయ్యాయి. ఇక కిలో వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పడిపోయి రూ.2.90 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే కిలోపై రూ.15 వేల వరకు తగ్గుదల కనిపించింది.
ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడం, అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇంకా ఎక్కువ కాలం పెంచిన స్థాయిలో కొనసాగించే అవకాశాలపై సంకేతాలు రావడంతో డాలర్ బలపడుతోంది. అదే సమయంలో అమెరికా ట్రెజరీ యీల్డ్‌లు పెరగడం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతోంది.
55
భవిష్యత్తులో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం
కేంద్ర నిర్ణయాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు బంగారం దిగుమతులను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో బంగారం, వెండి దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ప్లాటినంపై కూడా సుంకాలను పెంచడంతో విలువైన లోహాల మార్కెట్‌లో భవిష్యత్తులో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతాయన్నదానిపై రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా పసిడి మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదు.