Gold Price Hike: బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి. వరుసగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న పసిడి రేట్లు.. ఈరోజు మరోసారి పెరిగాయి. అయితే ఈ పెరుగుదలకు పండగ డిమాండ్ కాదు.. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిణామాలే కారణంగా కనిపిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తున్న పసిడి రేట్లు.. తాజాగా మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పైకి కదిలాయి. అయితే వెండి ధర మాత్రం ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది.
24
ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తగ్గుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమైంది.
ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? భవిష్యత్తులో వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి సంకేతాలు ఇవ్వనుంది? అనే అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర సుమారు 0.8 శాతం పెరిగింది. వెండి ధర కూడా దాదాపు 1.5 శాతం లాభపడింది.
34
రూ.1,53,440కు చేరిన పసిడి
దేశీయ మార్కెట్లోనూ ఇదే ప్రభావం కనిపించింది. MCXలో బంగారం, వెండి ధరలు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం వంటి పరిణామాలు బంగారం ధరల కదలికపై ప్రభావం చూపించాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.1,40,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరిగి రూ.1,53,440కు చేరింది. మరోవైపు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ఒక గ్రాము వెండి రూ.250 వద్ద స్థిరంగా ఉంది. దీంతో కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా కొనసాగుతోంది.
ప్రస్తుతం మార్కెట్ వర్గాల దృష్టి మొత్తం అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపైనే ఉంది. వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయం, రాబోయే రోజుల్లో ఇచ్చే సంకేతాలు బంగారం ధరలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదే సమయంలో డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు కూడా పసిడి కదలికలకు కీలకంగా మారనున్నాయి.