Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో

Published : Sep 15, 2026, 07:22 PM IST

Mini Fridge: ఫ్రిజ్‌ అనగానే మనకు పెద్ద సైజులో ఉండే రిఫ్రిజిరేటర్లు గుర్తుకొస్తాయి. అయితే ప్రస్తుతం చిన్న స్థలంలో పెట్టుకునే మినీ ఫ్రిజ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో KILIG Frio Ultra మినీ ఫ్రిజ్ ఒక‌టి.

PREV
15
10 లీటర్ల కెపాసిటీ.. 11 క్యాన్లు పెట్టుకోవచ్చు

KILIG Frio Ultra మినీ ఫ్రిజ్‌లో 10 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. ఇందులో సుమారు 11 సాధారణ సైజు డ్రింక్‌ క్యాన్లను పెట్టుకోవచ్చు. దీంతో పాటు స్నాక్స్‌, పండ్లు, చిన్న ఫుడ్‌ ప్యాకెట్లు, స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ వంటి వాటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న రెండు షెల్ఫ్‌లను అవసరానికి అనుగుణంగా సర్దుకోవచ్చు. ఎక్కువ ఎత్తున్న వస్తువులను పెట్టాల్సి వచ్చినప్పుడు షెల్ఫ్‌లను పూర్తిగా తొలగించే సదుపాయం కూడా ఉంది.

25
చల్లగా ఉంచడంతో పాటు వేడిగా కూడా ఉంచుతుంది

ఈ మినీ ఫ్రిజ్‌లో ప్రధాన ప్రత్యేకత కూలింగ్‌, వార్మింగ్‌ రెండు మోడ్‌లు ఉండటం. కూలింగ్‌ మోడ్‌లో గది ఉష్ణోగ్రత కంటే సుమారు 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌ వరకు తక్కువగా చల్లబరచగలదు. ఇక వార్మింగ్‌ మోడ్‌లో ఆహారాన్ని 50 నుంచి 65 డిగ్రీల సెల్సియస్‌ మధ్య వేడిగా ఉంచుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఒక్క బటన్‌తోనే కూలింగ్‌, వార్మింగ్‌ మోడ్‌లను మార్చుకోవచ్చు.

35
ఇంట్లోనూ.. కారులోనూ ఉపయోగించుకోవచ్చు

KILIG Frio Ultraను ఇంట్లో మాత్రమే కాకుండా కారులోనూ ఉపయోగించుకోవచ్చు. ఇందులో 220–240V AC ప్లగ్‌, 12V DC ప్లగ్‌ ఉన్నాయి. ఇంట్లో, ఆఫీస్‌లో లేదా హోటల్‌లో సాధారణ విద్యుత్‌ సాకెట్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు 12V కనెక్షన్‌తో ఉపయోగించుకోవచ్చు. అందుకే రోడ్‌ ట్రిప్స్‌, ప్రయాణాలు చేసే వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

45
LCD డిస్‌ప్లే.. తక్కువ శబ్దంతో పనిచేస్తుంది

ఈ మినీ ఫ్రిజ్‌లో LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఉష్ణోగ్రతను చూసుకోవడంతో పాటు అవసరానికి అనుగుణంగా సెట్‌ చేసుకోవచ్చు. కూలింగ్‌, వార్మింగ్‌ మోడ్‌లను కూడా సులభంగా మార్చుకోవచ్చు. ఇది థర్మోఎలక్ట్రిక్‌ కూలింగ్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. దాదాపు 42dB శబ్దంతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అందువల్ల బెడ్‌రూమ్‌, స్టడీ టేబుల్‌, ఆఫీస్‌ డెస్క్‌ వంటి ప్రదేశాల్లోనూ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు.

55
తక్కువ స్థలం.. సులభంగా తీసుకెళ్లొచ్చు

ఈ మినీ ఫ్రిజ్‌ పరిమాణం 18.2 × 27.7 × 17.3 సెంటీమీటర్లు. బరువు సుమారు 4.2 కిలోలు ఉంటుంది. క్యారీ హ్యాండిల్‌ ఉండటంతో ఒకచోట నుంచి మరోచోటికి సులభంగా తీసుకెళ్లొచ్చు. టెంపర్డ్‌ గ్లాస్‌ డోర్‌ ఉండటం వల్ల చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం మీద డ్రింక్స్‌, చిన్న ఆహార పదార్థాలు, స్కిన్‌కేర్‌ ఉత్పత్తులు వంటివి చల్లగా లేదా వేడిగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రొడక్ట్‌పై 1 సంవత్సరం KILIG వారంటీ కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం దీని ధర రూ.18,990 కాగా 58 శాతం తగ్గింపుతో రూ.7,980కి అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories