అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల కదలికలు, డాలర్ విలువలో మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు కూడా ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతాయి.
అయితే, బంగారం ధరలు మళ్లీ తగ్గుతాయా లేదా మరింత పెరుగుతాయా అనేది కచ్చితంగా చెప్పలేం. ఆభరణాలు కొనుగోలు చేసేవారు రోజువారీ ధరలను పరిశీలించడంతో పాటు, జీఎస్టీ, తరుగు, మజూరీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.