Gold Price Crash: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్...భారీగా కుప్పకూలిపోయిన పసిడి, వెండి

Published : Aug 28, 2026, 11:48 AM IST

Gold Price Crash: భారత్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వచ్చినప్పటికీ.. ఇవాళ ఒక్కసారిగా ధరలు దిగివచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు కొంత ఊరట లభించింది.

PREV
15
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

భారత్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వచ్చినప్పటికీ.. ఇవాళ ఒక్కసారిగా ధరలు దిగివచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు కొంత ఊరట లభించింది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఏకంగా రూ.3,160 వరకు తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.2,900 మేర పడిపోయింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధరలోనూ రూ.2,370 వరకు తగ్గుదల కనిపించింది. ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో.. ఈ ఒక్కరోజు తగ్గుదల మార్కెట్‌లో ఆసక్తికరంగా మారింది.

25
బంగారం బాటలోనే వెండి

అటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధరలో దాదాపు రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.2.60 లక్షల స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అంశాలు విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

35
హర్మూజ్ జలసంధిలో అమెరికా కీలక చర్య

బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్న అంతర్జాతీయ పరిణామాల్లో హర్మూజ్ జలసంధి పరిస్థితి కూడా కీలకంగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకాయానంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ నౌకా మార్గాల్లో ఇరాన్ సీమైన్స్ ఏర్పాటు చేసినట్లు వచ్చిన వార్తలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకాయానాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు అమెరికా కీలక చర్య చేపట్టింది. సముద్ర మార్గంలో ఏర్పాటు చేసిన సీమైన్స్‌ను తొలగించే ఆపరేషన్‌ను నిర్వహించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌ను రహస్యంగా చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.

45
హర్మూజ్ ఎఫెక్ట్

హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన మార్కెట్‌కు అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఈ మార్గంలో నౌకాయానానికి అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి పెరగవచ్చు. ప్రస్తుతం హర్మూజ్‌లో పరిస్థితిని ప్రపంచ మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి. మరోవైపు యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి నౌకాయానం సురక్షితంగా కొనసాగుతుందనే నమ్మకం పెరిగితే.. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే పసిడి ధరలు తిరిగి పెరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.

55
పెట్టుబడిదారుల సెంటిమెంట్

అందుకే ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గినప్పటికీ.. రాబోయే రోజుల్లో ధరలు ఏ దిశగా కదులుతాయన్నది అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి పరిస్థితి, డాలర్ విలువ, చమురు ధరలు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలు పసిడి ధరలకు కీలకంగా మారనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories