అరటి నార బిజినెస్ తో మంచి లాభాలు..
అరటి కాండం నుండి తయారు చేసిన నారను టెక్స్‌టైల్ తయారీదారులు, హస్తకళల వస్తువులు చేసేవారు, పేపర్, ప్యాకేజింగ్ కంపెనీలు, ఎకో-ఫ్రెండ్లీ బ్రాండ్లు, అలాగే ఎగుమతిదారులకు అమ్మవచ్చు. కేవలం నారను అమ్మడమే కాకుండా దానితో తాడు, చాపలు, బ్యాగులు, హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు, ప్రత్యేకమైన కాగితం, పర్యావరణ హితమైన ప్యాకేజింగ్ ఉత్పత్తులు తయారుచేసి అమ్మితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.
మొదట స్థానిక మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించి, ఆ తర్వాత B2B (బిజినెస్-టు-బిజినెస్) కస్టమర్లను సంపాదించుకోవాలి. డిమాండ్ పెరిగే కొద్దీ ఉత్పత్తిని పెంచుతూ, విదేశీ మార్కెట్లకు కూడా మీ ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చు. వ్యవసాయ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకునే ఈ వ్యాపారంలో మీరు మంచి లాభాలు సంపాదించవచ్చు.