ముందుగా బంగారం ధరల విషయానికి వస్తే.. నవంబర్ 28న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.540 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,27,860గా ఉంది. అంటే తులం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గత రోజుతో పోలిస్తే కొంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది.
ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,17,200 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ధరలను గమనించవచ్చు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.