24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.1,44,000కు చేరుకుంది. నగల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200 తగ్గి రూ.1,32,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.160 తగ్గి 10 గ్రాములకు రూ.1,08,000గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, తిరువనంతపురం వంటి ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే వినియోగదారులు ఈ ధరలపై అదనంగా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని జ్యువెలరీ వ్యాపారులు సూచిస్తున్నారు.