Today Gold Price in Hyderabad: బంగారం, వెండి విషయంలో బిగ్ సర్ ప్రైజ్. ధరలు వరుసగా ఢమాల్ అంటున్నాయి. ఇప్పుడే కొనేయడం మంచిదా కాదా అని నిపుణులను సంప్రదించండి.
బంగారం, వెండి రేట్లు ఇలా తగ్గుతున్నాయేంటి? వరుసగా మూడ్రోజులుగా ధరలు కుప్పకూలిపోతున్నాయి. ఇది మహిళలు, పెళ్లిళ్లు పెట్టుకున్న వారికి భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ధరలు పడిపోవడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
24
మేలిమి బంగారంపై రూ.1,030 తగ్గింపు
తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పతనమయ్యాయి. 24 క్యారెట్ల బంగారం తులంపై రూ.1,030 తగ్గింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.950 తగ్గింది. ఇప్పుడు మేలిమి బంగారం ధర రూ.1,59,660కు చేరింది. 22 క్యారెట్ల స్వర్ణం రూ.1,46,350 కు వచ్చేసింది.
34
సంతోషంతో పాటు ఆందోళనలో కొనుగోలుదారులు
గతంలో రూ.1.64లక్షలు ఉన్న బంగారం ఇప్పుడు రూ.రూ.1,59,660కు పడిపోవడం ఊరట కలిగిస్తోంది. కొద్ది రోజుల్లోనే ఇంత మార్పురావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరో వైపు ఆందోళన కూడా చెందుతున్నారు. ఎందుకంటే ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఇంకా ముగియలేదు. మళ్లీ ఏ క్షణాన ధరలు పెరుగుతాయో అని హడలిపోతున్నారు.
ఇక వెండి కూడా మామూలుగా ఉంది. ఈ మధ్య బాగా పెరిగిన వెండి కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు మార్కెట్లు రూ.2,75,000 వేల మధ్య తచ్చాడుతోంది.
ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ముడి చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.