Today Gold Price in Hyderabad: రెండు రోజుల్లో ఇంత తగ్గిందా? కొనేవారికి ఉగాది బంపరాఫరే!

Published : Mar 13, 2026, 11:01 AM IST

Today Gold Price in Hyderabad: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు దోబూచులాడుతున్నాయి. రెండు రోజుల క్రితం ధరలు భయపెట్టినా...ఇప్పుడు కాస్త దిగొచ్చు రిలీఫ్ ఇచ్చింది. 

PREV
15
పతనం దిశగా

పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారం, వెండి రేట్లు తగ్గి మధ్యతరగతి ప్రజలకు ఊరట దొరికినట్లైంది. వరుసగా రెండో రోజు కూడా గోల్డ్ రేట్లు తగ్గడంతో మార్కెట్‍లో చర్చలు మొదలైయ్యాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన పసిడి, సిల్వర్ ధరలు ఇప్పుడు పతనమవుతున్నాయి. మరి ఇది ఎంతకాలం కొనసాగుతుంది? నిపుణులు ఏం చెప్తున్నారంటే..

25
వారంతో మొదట్లో పెరిగిన ధరలు

ఈ వారం మొదట్లో బంగారం ధరలు కొంత పెరిగినట్లు కనిపించాయి. అయితే ఆ పెరుగుదల ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం రెండు రోజులు మాత్రమే గోల్డ్ రేట్లు పెరిగి, తర్వాత మళ్లీ తగ్గడం ప్రారంభమైంది. ఇవాళ చూసుకుంటే గణనీయంగా తగ్గాయి.

35
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.980 తగ్గి, రూ.1,61,240

హైదరాబాద్ మార్కెట్‍లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.980 తగ్గి, రూ.1,61,240 వద్దకు చేరింది. గత రెండు రోజుల్లో కలిపి దాదాపు రూ. 2వేల వరకు పతనం నమోదైంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ ధర కూడా తగ్గింది. తులంపై రూ.900 తగ్గి రూ.1,47,800 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా పతనమైంది. రూ.740 దిగి రూ.1,20,930 వద్ద కొనసాగుతోంది.

45
బంగారం బాటలోనే వెండి

బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ఇటీవల 3లక్షలకు చేరుకున్న కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,90,000 వద్దకు వచ్చింది. ప్రపంచ మార్కెట్‍లో బంగారం, వండి ధరలు పెద్దగా మార్పు లేకుండా ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి.

55
బంగారం ధరలపై డాలర్‍ ప్రభావం

డాలర్‍లో వచ్చిన మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్వల్బణ ఫియర్, చమురు పెరుగుదల వంటి అంశాలు కూడా మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి...చూసి కొనుగోలు చేయడమైనా? పెట్టుబడి పెట్టడమైనా చేయడం మంచిదని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories