Money: రిస్క్ వర్సెస్ రివార్డ్.. డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడితే.. కొద్ది నెలల్లోనే డబుల్ అవుతుంది..

Published : Apr 15, 2026, 09:35 PM IST

Money: మీ పెట్టుబడులపై వచ్చే రాబడిని అంచనా వేయడంలో ఉండే మెలకువలను నిపుణులు వివరించారు. బ్యాంక్ ఎఫ్‌డి, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లలో వచ్చే వాస్తవ రిటర్న్స్ ఎంత.?

PREV
15
నగదును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి

చాలా మంది తమ వద్ద ఉన్న నగదును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, దాని ద్వారా వచ్చే రాబడి ఎంత అనే విషయంలో స్పష్టత లేకుండా ఉంటారు. కేవలం వచ్చే అంకెలను చూసి మోసపోకుండా, అసలు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడం ముఖ్యం.

25
రిస్క్ వర్సెస్ రివార్డ్: ఒక అవగాహన

బ్యాంక్ ఎఫ్‌డి (Bank FD): ఇది అత్యంత సురక్షితమైనది. ప్రస్తుతం సుమారు 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే ఇది కేవలం ద్రవ్యోల్బణాన్ని (Inflation) మాత్రమే తట్టుకోగలదు, అదనపు సంపదను సృష్టించలేదు.

35
మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఇది

మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds): ఇవి బ్యాంకు కంటే మెరుగైనవి. సుమారు 12 శాతం నుండి 15 శాతం వరకు రిటర్న్స్ ఆశించవచ్చు. 12 శాతం దాటితే అది అద్భుతమైన రిటర్న్ కిందే లెక్క.

45
స్టాక్ మార్కెట్ రిస్క్..

స్టాక్ మార్కెట్ (Stock Market): రిస్క్, రివార్డ్ రెండూ ఎక్కువగా ఉంటాయి. 18-20 శాతం వరకు రాబడి ఉండవచ్చు. కానీ పెట్టుబడి మొత్తం పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

55
రిస్క్ చాలా ఎక్కువ

ట్రేడింగ్, ఎఫ్ అండ్ ఓ(Trading & F&O): ఇవి చాలా రిస్క్‌తో కూడుకున్నవి. తక్కువ సమయంలో ఎక్కువ రావచ్చు లేదా మొత్తం పోవచ్చు.

క్రిప్టో కరెన్సీ, బెట్టింగ్ యాప్స్: ఇవి అత్యంత ప్రమాదకరమైనవి, వీటిలో రిస్క్ చాలా ఎక్కువ.

Read more Photos on
click me!

Recommended Stories