Today Gold Rate In Hyderabad: ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధరలు ఇప్పటికే 20 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. భారతదేశంలో బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా సంప్రదాయం, భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు.
గత నెల రోజుల రికార్డులు చూస్తే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఫిబ్రవరి నెలలో తులం బంగారం ఏకంగా రూ.లక్షా 80వేలకు చేరింది. వెండిఅయితే రూ. 4 లక్షలు దాటేసింది. ఆ తర్వాత నుంచి వాటిలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఒకసారి అమాంతం పెరిగితే...మరోసారి ధరలు పడిపోతున్నాయి. అసలే శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయానికి ఉన్న రేటు మధ్యాహ్నానానికి ఉండటంతో...దీంతో గందరగోళం నెలకొంది.
25
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,63,310
అయితే బంగారం ధరల్లో ఇవాళ కొద్దిపాటి మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.930 పెరిగి రూ.1,63,310కి చేరింది. రెండురోజుల్లో రూ.1630 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.850 ఎగబాకి రూ.1,49,700 పలుకుతోంది. అటు వెండి స్థిరంగా కొనసాగుతోంది. నిన్ననే రూ.10వేలు పెరిగి రూ. 3లక్షలకు చేరుకుంది.
35
ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప తేడాలు
అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం ధరల్లో స్వల్ప తేడాలు ఉంటున్నాయి. స్థానిక డిమాండ్, ట్యాక్సులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ధరలు మారుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో మాత్రం మేలిమి బంగారం ధర రూ.1,63,310 వద్ద కొనసాగుతోంది.
హుర్మూజ్ వద్ద పరిస్థితి మారితే ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం
క్రూడ్ ఆయిల్ మార్కెట్‍లో జరిగిన పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్‍లో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించడంతో కొంత ఊరట కలిగించింది. అయితే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. ఒకవేళ హర్మూజ్ జలసంధి వద్ద మళ్లీ పరిస్థితి మారితే మాత్రం బంగారం ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
55
గ్లోబల్ ట్రెండ్‍ను గమనించి కొనుగోలు చేయడం మంచిదని సూచన
బంగారం ఎక్కడ ఎలా ఉన్నా....ధరల ప్రభావం భారత్‍లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి అంశం భారతీయులకు గోల్డ్ తోనే ముడిపడి ఉంటుంది. చిన్న శుభకార్యమైనా బంగారం ఉండాల్సిందే. అలాంటిది ఇప్పుడున్న ధరలు చూసి హడలిపోతున్నారు. ఆడపిల్లల తండ్రులు మరింత బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇప్పుడు బంగారం కొనాలా లేదా అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ ట్రెండ్‍ను గమనించి కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.