Gold Price Hike: గోల్డ్ మార్కెట్ యూటర్న్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

Published : Jul 18, 2026, 11:36 AM IST

Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఎగబాకాయి. అసలు ఈ పెరుగుదలకు కారణమేంటి?

PREV
13
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెట్టడం ప్రారంభించాయి. గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన పసిడి... ఇప్పుడు మళ్లీ ఖరీదెక్కింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేట్లు పెరిగాయి.

గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు శనివారం ఒక్కసారిగా పెరగడంతో మార్కెట్ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌కు డిమాండ్ పెరగడం, పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్ అసెట్‌గా బంగారాన్ని ఎంచుకోవడం వల్ల ఈ పెరుగుదల నమోదైంది.

23
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. అదే ప్రభావం దేశీయ మార్కెట్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,43,290గా ఉంది. శుక్రవారంతో పోలిస్తే ఇది రూ.760 పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350గా నమోదైంది. ఇందులో రూ.700 పెరుగుదల కనిపించింది.  బంగారం ధరలు పెరిగినా... వెండి మాత్రం ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.35 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా కేజీ వెండి రూ.2.35 లక్షల వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2.30 లక్షలుగా కొనసాగుతోంది.

33
బంగారం ధరలకు శనివారం బ్రేక్

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలకు శనివారం బ్రేక్ పడింది. ఒక్కరోజులోనే రూ.700 నుంచి రూ.760 వరకు పెరగడంతో కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు, డాలర్ బలపడటం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వంటి అంశాలను బట్టి రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ప్రతిరోజూ ధరలను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories