ఉక్రెయిన్-రష్యా, గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మొదలు ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అస్థిరతలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. ఇది బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. అమెరికా మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 3000 డాలర్లకు చేరుకుంది. భారత్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90 వేల దాటేసి ఆల్ టైమ్ హైకి చేరింది. అయితే తాజాగా బంగారం ధరలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుంది.
గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 330 వరకు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 81,850గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,290 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,000గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,440 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 81,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,290 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 81,850, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,290 వద్ద కొనసాగుతోంది.
* చెన్నై విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,290 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 81,850గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,290 వద్ద కొనసాగుతోంది. విజయవాడతో పాటు సాగర నగరం విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.?
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టగా వెండి ధరలు మాత్రం దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర లక్ష దాటేసింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, కేరళలో కిలో వెండి ధర రూ. 1,10,000 వద్ద కొనసాగుతోంది. కాగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.