పెరగడం తప్ప తగ్గడం లేదన్నట్లు దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 80 డాలర్లకు పైగా తగ్గడం విశేషం. దీంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఒక్క రోజే తులం బంగారంపై రూ. 2400 వరకు తగ్గింది. ఈ నెల 1వ తేదీన తులం బంగారం ధర రూ. 94,000గా ఉన్న విషయం తెలిసిందే. ఇక వెండి ధర కూడా తగ్గింది. ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 84,140గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,780 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 83,990కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,630గా ఉంది.
* చెన్నై విషయానికొస్తే ఇక్కడ శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 83,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,630 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,630 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,990గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్ రూ. 91,630 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 83,990కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,660 వద్ద కొనసాగుతోంది.
* సాగరనగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 83,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.91,600గా ఉంది.
Silver Price Today
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.?
వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 98,900 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్, కేరళ, చెన్నైలలో గరిష్టంగా కిలో వెండి ధర రూ. 1,07,900గా ఉంది.
బంగారం ధరలు తగ్గడానికి కారణం ఏంటి.?
అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితి వాతావరణం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం వంటి కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి మార్గంగా భావించారు. ఈ కారణంగానే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే తాజాగా పెట్టుబడి దారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్న కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
gold price last years
బంగారం ధరలు ఇంకా తగ్గనున్నాయా.?
అయితే బంగారం ధరలు భారీగా పెరిగిన తరుణంలో కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే వారీ సంఖ్య భారీగా తగ్గిందని పాత ఆభరణాల మార్పిడితో... కొత్తవి తీసుకోవడం పెరిగిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్ విధానం కారణంగా బంగారం ధరలు ఎక్కువ కాలం ఇలాగే గరిష్టంగా ఉండవనే అంచనాలతో బంగారాన్ని విక్రయించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు ఫలించి, యుద్ధ విరమణ జరిగితే బంగారం ధరలు మరింత తగ్గడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే డాలర్‌తో పోల్చితే బంగారం బలపడుతుండడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణంగా అభిప్రాయపడుతున్నారు.