ఫోర్బ్స్ రిచ్ లిస్ట్: పాపం అంబానీ.. మరీ ఇంతలా పడిపోయాడేంటి?

ప్రపంచ కుబేరుల జాబితా విడుదల చేసిన ప్రతిసారీ మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తప్పకుండా టాప్ 10లో ఉండేవారు. ఈసారి మాత్రం ఏకంగా 18వ స్థానానికి పడిపోయారు. కొంతకాలంగా రిలయన్స్ షేర్లు కుదేలవడమే అందుకు కారణం. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ టాప్ లో ఉండగా, ముఖేష్ అంబానీ 18వ స్థానానికి పడిపోయారు. గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ కూడా సంపన్నుల లిస్టులో ఉన్నారు.

Forbes rich list out mukesh ambani slips elon musk mark Zuckerberg soar check full rankings in telugu
టాప్ టెన్ నుంచి ఔట్

భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల టాప్ 10 లిస్టు నుంచి పడిపోయారు. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఎలాన్ మస్క్ రూ.29 లక్షల కోట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇండియాకి చెందిన ముఖేష్ అంబానీ టాప్ 10 లిస్టులో లేరు. అంబానీ రూ.7.85 లక్షల కోట్లతో 18వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ 28వ స్థానంలో నిలిచారు.


ప్రపంచంలో 3028 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి అందరి మొత్తం సంపద రూ.1,368 లక్షల కోట్లుగా తేలింది. వీరందరిలో అమెరికా అత్యధిక బిలియనీర్లతో మొదటి స్థానంలో నిలిచింది.

Latest Videos

vuukle one pixel image
click me!