ప్రపంచంలో అత్యంత ధనవంతులైన మహిళలు ... టాప్ 10 లో ఇండియన్ మహిళ

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పురుష వ్యాపారవేత్తలు ఎవరో చాలామందికి తెలుసు... కానీ ధనవంతురాళ్లు ఎవరో తెలుసా?... ఇక్కడ ప్రపంచంలోనే టాప్ 10 రిచ్చెస్ట్ మహిళలు ఎవరో ఇక్కడ చూద్దాం. 

Forbes Top 10 Wealthiest Women Globally Savitri Jindal in telugu akp
Alice Walton

అలైస్ వాల్టన్ :

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల జాబితాలో నంబర్ 1 స్థానంలో వాల్మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె ఆలిస్ వాల్టన్ ఉన్నారు. ఈమె నికర ఆస్తుల విలువ $101 బిలియన్లు. అమెరికాలో నివసించే వాల్టన్ వయసు 75 సంవత్సరాలు. ఆమె సామ్ వాల్టన్ ఏకైక కుమార్తె మరియు కళా రంగంలో గణనీయమైన కృషి చేస్తోంది. ఆమె 2025 లో ఒక వైద్య కళాశాలను ప్రారంభించబోతున్నారు. 

Forbes Top 10 Wealthiest Women Globally Savitri Jindal in telugu akp
Francoise Bettencourt Meyers

ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 

లోరియల్ వ్యవస్థాపకుడి మనవరాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ $81.6 బిలియన్ల నికర విలువతో రెండవ ధనిక మహిళగా నిలిచారు. ఫ్రాన్స్‌కు చెందిన 71 ఏళ్ల మేయర్స్ గత సంవత్సరం ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆమె వాటా 20% తగ్గడంతో ఆమె రెండవ స్థానానికి పడిపోయింది.  


Julia Koch

జూలియా కోచ్  

62 ఏళ్ల అమెరికన్ జూలియా కోచ్ ప్రపంచంలోనే మూడవ ధనవంతురాలైన మహిళ. కోచ్ & ఇంక్ ఆమె సంపదకు మూలం. ఆమె ఆస్తుల విలువ $74.2 బిలియన్లు. 2019లో భర్త డేవిడ్ కోచ్ మరణించిన తర్వాత ఆమె చమురు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ సహా అన్ని వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇంక్ లో  42% పెట్టుబడిని కలిగి ఉంది మరియు ఆమె ఈ సంవత్సరం దాదాపు $10 బిలియన్లు సంపాదించింది.

Jacqueline Mars

జాక్వెలిన్ మార్స్

అమెరికాకు చెందిన జాక్వెలిన్ మార్స్ వయసు 85 సంవత్సరాలు, ఆమెకు మిఠాయిలు మరియు పెంపుడు జంతువుల ఆహార వ్యాపారం ఉంది. ఆమె ఆస్తుల నికర విలువ $46.6 బిలియన్లు. మార్స్ & మాస్ స్నికర్స్, పెడిగ్రీ పెంపుడు జంతువుల ఆహారాన్ని తయారు చేసే మార్స్ ఇంక్ సహ-యజమానులు. ఆమె తాత 1911 లో దీనిని ప్రారంభించాడు.

80 ఏళ్ల రఫెలా అపోంటేకు ఫోర్బ్స్ జాబితాలో అత్యంత ధనవంతురాలైన మహిళ జాబితాలో చోటు దక్కించుకున్నారు.  ఆమె ఆస్తుల నికర విలువ $37.7 బిలియన్లు. షిప్పింగ్ పరిశ్రమ ఆమె ప్రధాన ఆదాయ వనరు. ఈ స్విస్ మహిళ 1970లో తన భర్తతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ (MSC)ని స్థాపించారు. నేడు ఈ వ్యాపారంలో 900 నౌకల సముదాయం ఉంది. ఆమె భర్త జియాన్‌లుయిగి కంపెనీలో సగం వాటా కలిగి ఉన్నారు.

Savitri Jindal

సావిత్రి జిందాల్  

సావిత్రి జిందాల్ మరియు కుటుంబం భారతదేశ ఉక్కు పరిశ్రమలో ప్రసిద్ధి చెందారు. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకున్నారు మరియు 75 ఏళ్ల సావిత్రి జిందాల్ భారతదేశంలో నంబర్ 1 ధనవంతురాలు అయ్యారు. ఆమె ఆస్తుల నికర విలువ $35.5 బిలియన్లు.

ఉక్కు, విద్యుత్, సిమెంట్ మరియు మౌలిక సదుపాయాలతో సహా బహుళ రంగాలలో విస్తరించి ఉన్న భారతీయ కార్పొరేట్ సమ్మేళనమైన జిందాల్ గ్రూప్ యజమాని. ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె జిందాల్ ఫౌండేషన్‌ను చూసుకుంటున్నారు. ఆమె తొమ్మిది మంది పిల్లలలో నలుగురు కంపెనీని నడపడానికి సహాయం చేస్తారు.

అమెరికాకు చెందిన 63 ఏళ్ల అబిగైల్ జాన్సన్ 32.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు. ఆమె ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ యజమాని, మరియు బోస్టన్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్ కంపెనీలో 28.5% వాటాను కలిగి ఉంది, దీనిని ఆమె తాత 1946లో స్థాపించారు. తన తండ్రి ఎడ్వర్డ్ "నెడ్" జాన్సన్ III మరణం తర్వాత 2014లో ఆమో కంపెనీ CEOగా బాధ్యతలు స్వీకరించారు.

మిరియం అడెల్సన్  

ఇజ్రాయెల్‌లో జన్మించిన బిలియనీర్ కుటుంబం అమెరికన్ పౌరసత్వం తీసుకొని అక్కడే స్థిరపడింది. ఆమె సంపద $32.1 బిలియన్లు. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 8వ స్థానాన్ని పొందారు.ఆమె ఆదాయ వనరు క్యాసినో. అయితే ఆమె ప్రాథమికంగా ఒక వైద్యురాలు, భర్త షెల్డన్ అడెల్సన్ 1989లో స్థాపించిన కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు.
 

మార్లిన్ సైమన్స్  

ఆమె ప్రసిద్ధ అమెరికన్ పెట్టుబడిదారుడు జిమ్ సైమన్స్ భార్య మరియు సైమన్స్ ఫౌండేషన్‌ను చూసుకుంటుంది. సైన్స్ విద్య మరియు పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి ఈ జంట సంయుక్తంగా ఈ సంస్థను స్థాపించారు. హెడ్జ్ ఫండ్లే వారి ఆదాయ వనరు. ఆమె సంపద $31 బిలియన్లు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ మరియు ఈస్ట్ హార్లెం స్కాలర్ అకాడమీల బోర్డులలో సేవలందిస్తోంది. స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం యొక్క మహిళా నాయకత్వ బోర్డుకు చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

మెలిండా ఫ్రెంచ్ గేట్స్

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన బిల్ గేట్స్ విడాకులు తీసుకున్న భార్య, 60 ఏళ్ల మెలిండా $30.4 బిలియన్ల ఆస్తుల యజమాని మరియు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకున్నారు.ఆమె ఆదాయ వనరు మైక్రోసాఫ్ట్ మరియు పెట్టుబడులు.

జూన్ 2024లో ఆమె గేట్స్ ఫౌండేషన్‌కు రాజీనామా చేసి, మహిళల నేతృత్వంలోని నిధులు మరియు స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఆమె స్థాపించిన పివోటల్ వెంచర్స్ అనే సంస్థపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇది ప్రపంచంలోని సామాజిక మార్పు మరియు మహిళలపై దృష్టి సారించిన ఒక ఎన్జివో.

Latest Videos

vuukle one pixel image
click me!