Gold Price: బంగారం ఆగ‌మాగం.. భారీగా త‌గ్గుతున్న గోల్డ్ రేట్‌. ఏకంగా రూ. 6 వేలు డౌన్

Published : May 02, 2025, 09:47 AM IST

మొన్న‌టి వ‌ర‌కు చుక్క‌లు చూపించిన బంగారం ధ‌ర‌లు ఒక్క‌సారిగా దిగొస్తున్నాయి. తులం బంగారం ధ‌ర రూ. ల‌క్ష దాటి అంద‌రినీ షాక్‌కి గురి చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా గోల్డ్ రేట్స్ మ‌ళ్లీ దిగొస్తున్నాయి. గ‌డిచిన వారం రోజుల్లోనే ఏకంగా రూ. 6 వేల‌కి పైగా త‌గ్గ‌డం విశేషం. తాజాగా శుక్ర‌వారం కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
Gold Price: బంగారం ఆగ‌మాగం.. భారీగా త‌గ్గుతున్న గోల్డ్ రేట్‌. ఏకంగా రూ. 6 వేలు డౌన్

గ‌డిచిన వారం రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తులం బంగారం ధ‌ర రూ. ల‌క్ష‌న్న‌ర‌కు చేరుతుంద‌ని ప‌లు అభిప్రాయాలు వ‌చ్చాయి. అయితే ఆ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుతున్నాయి. శుక్ర‌వారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740కి దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 95,720 వ‌ద్ద కొన‌సాగుతోంది. 
 

25

దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.? 

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 87,890గా ఉండ‌గా 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 95,587 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,740, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,720కు చేరింది. 

35

చెన్నై విష‌యానికొస్తే ఇక్క‌డ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే హైద‌రాబాద్‌తో పాటు విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నంలో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,720 వ‌ద్ద కొన‌సాగుతోంది. 
 

45
Gold Price

బంగారం ధ‌ర‌లు ఎందుకు త‌గ్గుతున్నాయి.? 

బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి ప‌లు కార‌ణాల‌ను నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా లాభాల్లో ట్రేడ్ అవుతున్న త‌రుణంలో బంగారం ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ‌ని అంటున్నారు. బంగారంపై పెట్టుబ‌డి పెట్టే వారి సంఖ్య త‌గ్గుతోంద‌ని చెబుతున్నారు.  

55

అంతేకాకుండా డాల‌ర్ విలువ పెరుగుతుండ‌డం కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి  మ‌రో కార‌ణ‌మ‌ని అంటున్నారు. డాల‌ర్‌పై పెట్టుబ‌డి పెట్టే వారి సంఖ్య పెర‌గ‌డం కూడా బంగారం ధ‌ర త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories