Gold Price: చవకైన బంగారం...రికార్డు స్థాయి నుంచి కిందకు దిగొచ్చిన పసిడి

Published : Jun 01, 2026, 11:41 AM IST

Gold Price: వారం ప్రారంభంలోనే బంగారం కొనేవారికి భారీ గుడ్ న్యూస్. మళ్లీ బంగారం తగ్గి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడే బంగారం కొనడం లాభమా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 

PREV
14
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదొక సువర్ణావకాశం

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదొక సువర్ణావకాశం. ఎందుకంటే మార్కెట్లు ప్రారంభమైన వారంలో మొదట్లోనే పసిడి తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ధరలు తగ్గాయి. కొన్ని రోజులుగా అధిక స్థాయిలో కొనసాగిన పసిడి ధరలు మళ్లీ దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్పులు, డాలర్, పెట్టుబడిదారుల నిర్ణయాలే తగ్గుదలకు కారణాలుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

24
రూ.1,56,220కు చేరిన 24 క్యారెట్ గోల్డ్

ఇక హైదరాబాద్ మార్కెట్లో ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 తగ్గి...రూ.1,56,220 వద్ద నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 తగ్గి...రూ.1,43,200కు చేరుకుంది. మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 18 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,17,700గా ఉంది. 

34
మార్కెట్‍పై దృష్టి పెడుతున్న వినియోగదారులు

పసిడి ప్రియులకు ఇదొక మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. ఇక చూసుకుంటే కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఇటీవల వరుసగా పెరిగిన ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వినియోగదారులు ఇప్పుడు మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారు. 

44
ఇది మంచి అవకాశం

మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. సాధారణంగా అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు కొంత సానుకూలంగా మారడంతో పెట్టుబడిదారులు ఇతర ఆస్తులవైపు దృష్టి మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.

ధరల తగ్గుదల బంగారం కొనాలనుకునేవారికి అనుకూలంగా మారింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లు ఎప్పటికప్పుడు మారుతాయి. ధరల్లో తేడాలు కూడా ఉంటాయి కాబట్టి...గమనించుకుని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories