టికెట్ బుకింగ్ ఏజెంట్లకు ఆదాయం ప్రధానంగా వారు చేసే బుకింగ్స్ ఆధారంగా ఉంటుంది. IRCTC ఏజెంట్లు ప్రతి టికెట్ బుకింగ్ మీద కమీషన్ పొందుతారు. సాధారణంగా మీరు స్లీపర్ క్లాస్ టికెట్ బుకింగ్ మీద రూ. 20 వరకు, ఏసీ క్లాస్ టికెట్ మీద రూ. 40 వరకు కమీషన్ పొందొచ్చు. అలాగే ప్రతి నెల బుకింగ్‌లు పెరిగిన కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. సగటున ఒక IRCTC ఏజెంట్ నెలకు రూ. 10,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదించవచ్చు. ఇది బిజినెస్ ఎలా నిర్వహిస్తారనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది.
ఉద్యోగం చేస్తూ ఏజెంట్ గా ఎలా?
మీరు ఉద్యోగం చేస్తూనే ఐఆర్‌సీటీసీలో టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా పని చేయవచ్చు. ఎందుకంటే ఇది పార్ట్‌టైమ్‌గా కూడా చేయగలిగే వ్యాపారం. మీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, కస్టమర్‌లు బట్టి మీకు అనుసరించడానికి ఇష్టం వచ్చిన సమయంలో టికెట్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. దీనివల్ల మీరు రోజువారీ ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం పొందగలుగుతారు.