Gold: బంగారం కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Published : Apr 27, 2025, 01:55 PM IST

బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులైతే బంగారం పేరు తలవడానికి కూడా బయపడుతున్నారు. ఓ వైపు పెరిగిన ధరలు.. మరోవైపు కొన్ని బంగారం షాపుల్లో మోసాల వల్ల చాలామంది డబ్బు నష్టపోతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే బంగారం కొనే ముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవెంటో చూద్దాం.

PREV
15
Gold: బంగారం కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

BIS హాల్‌మార్క్ చూడండి

బంగారం షాపు వాళ్లు నగపై “హాల్‌మార్క్ ఉంది” అంటారు. కానీ హాల్‌మార్క్ పూర్తి గ్యారంటీ కాదు. కొన్నిసార్లు హాల్‌మార్క్ నకిలీది కూడా కావచ్చు. లేదా ఆభరణంలో మిశ్రమం ఉండవచ్చు. కొనుగోలు చేసేటప్పుడు BIS లోగో.. 6 అంకెల హాల్‌మార్క్ సంఖ్యను కచ్చితంగా తనిఖీ చేయండి.

25
మేకింగ్ ఛార్జ్‌

జువెలర్స్ మేకింగ్ ఛార్జ్‌లో లాభం పొందుతారు. కొనుగోలు చేసే ముందు మేకింగ్ ఛార్జ్ ఫిక్స్ అయిందా లేదా బరువు మీద ఆధారపడి ఉందా అని అడగండి. ధర, మేకింగ్ ఛార్జ్‌లను పోల్చి చూసుకోండి.

35
బరువు పెంచే ట్రిక్స్

కొంతమంది జువెలర్స్ ఆభరణాల డిజైన్‌లో బరువు పెంచేలా చేస్తారు. ఉదాహరణకు మందమైన బేస్, ఎక్కువ రాళ్లు పెడతారు. దీనివల్ల ఆభరణాలు బరువుగా కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

45
మార్పిడిలో సమస్యలు

పాత బంగారం అమ్మడానికి లేదా మార్చడానికి వెళ్లినప్పుడు, జువెలర్స్ దాని ధరను తగ్గిస్తారు. మేకింగ్ ఛార్జ్, నష్టం, పాలిషింగ్ పేరుతో తగ్గిస్తారు. కొనుగోలు చేసేటప్పుడు మార్పిడి విధానాన్ని తెలుసుకోండి.

55
ఆఫర్లలో కూడా మోసం

ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక ఎక్కువ ధర లేదా తక్కువ నాణ్యత ఉంటుంది. ఆశపడి తనిఖీ చేయకుండా కొనకండి. దానివల్ల డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories