మనందరికీ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. ఎక్కువ మంది డబ్బు లావాదేవీలు ఈ అకౌంట్స్ నుంచే చేస్తారు. అయితే ఇటీవల బ్యాంకులో నగదు జమ చేయడానికి సంబంధించి నియమాలు మారాయి. వీటి ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతాలో పరిమితికి మించి నగదు జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది.
నగదు డిపాజిట్ చేయడానికి నియమాలు
బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తాయి. ఇటీవల డబ్బు డిపాజిట్ కి సంబంధించి మరింత పారదర్శకత ఉండాలని రూ.50 వేలు అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే పాన్(PAN) నంబర్ తెలియజేయాలి.
రోజువారీ నగదు డిపాజిట్ పరిమితి రూ.1 లక్షకు మించి ఉండకూడదు.
సంవత్సరానికి రూ.10 లక్షలు దాటకూడదు..
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో రూ.10 లక్షల వరకు నగదును ఎలాంటి హెచ్చరిక లేకుండా డిపాజిట్ చేయవచ్చు. కానీ మీ అన్ని ఖాతాల్లో మొత్తం నగదు డిపాజిట్లు ఈ రూ.10 లక్షల లిమిట్ దాటితే లావాదేవీల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది.
లిమిట్ దాటితే ఏం జరుగుతుంది?
నిబంధనల మేరకు నగదు డిపాజిట్ లిమిట్ దాటితే మిమ్మల్ని ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) వివరాలు తెలియజేయాలి. మీరు సరైన వివరాలు సబ్మిట్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ మీ ట్రాన్సాక్షన్స్ ని ట్రాక్ చేస్తుంది. అందులో లోటుపాట్లు ఉన్నట్లు తేలితే మీరు భారీ జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఇక్కడ పెట్టుబడులు పెడితే మంచిది
మీ అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినప్పుడు అవి చట్టబద్ధంగా సంపాదించినవైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మీకు భారీ జరిమానాలు, శిక్షలు తప్పవు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సేవింగ్స్ ఖాతాలో ఉంచుకోవడం బదులు ఫిక్స్ డ్ డిపాజిట్లు (FDలు), మ్యూచువల్ ఫండ్స్ లేదా మెరుగైన రాబడిని అందించే ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది.
ఇది కూడా చదవండి కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..