Indian Railways: మీ దగ్గర ఈ టికెట్ ఉందా? రైల్వే కొత్త రూల్ ఇదే

Published : Sep 26, 2026, 01:04 PM IST

Train RAC Ticket Rules: రైలులో RAC టికెట్‌తో ప్రయాణిస్తున్నప్పుడు, పక్కన ఖాళీగా ఉన్న సీటు ఎవరికి ఇస్తారనే డౌట్ చాలామందికి వస్తుంది. అసలు ఈ RAC అంటే ఏంటి? ఖాళీ బెర్త్‌లను టీటీఈలు ఎలా కేటాయిస్తారో ఇక్కడ చూద్దాం.

PREV
16
RAC టికెట్ అంటే ?

రైలు ప్రయాణంలో కన్ఫర్మ్ టికెట్ దొరకనప్పుడు RAC టికెట్ రావడం కామన్. RAC అంటే క్యాన్సిలేషన్ మీద రిజర్వేషన్ అని అర్థం. ఈ టికెట్ ఉంటే రైలు ఎక్కొచ్చు కానీ, మొదట్లోనే బెర్త్ దొరకదు. ఎవరైనా ప్రయాణికులు తమ కన్ఫర్మ్ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటే, రైల్వే రూల్స్ ప్రకారం ఆ బెర్త్‌ను RAC ప్రయాణికులకు కేటాయిస్తారు.

26
రైలు ఖాళీ బెర్త్

రైలు బయలుదేరాక కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికుడు రాకపోతే ఆ బెర్త్ ఖాళీ అవుతుంది. ఇలాంటి ఖాళీ బెర్త్‌లను రూల్స్ ప్రకారం RAC ప్రయాణికులకు ఇస్తారు. టీటీఈలు తమ దగ్గర ఉండే HHT (హ్యాండ్ హెల్డ్ టెర్మినల్) డివైజ్ ద్వారా ఏ ప్రయాణికుడు వచ్చారు, ఎవరు రాలేదు అనేది రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఖాళీ అయిన బెర్త్‌లను RAC లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తారు.

36
అప్పుడు కేటాయిస్తారు?

ఈ బెర్త్‌ల కేటాయింపులో టీటీఈ చేతిలో ఉండే HHT డివైజ్ కీ రోల్ ప్లే చేస్తుంది. టీటీఈ తన కోచ్‌లకు సంబంధించిన ప్యాసింజర్ లిస్ట్‌ను ఈ డివైజ్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, ప్రయాణికుల హాజరును నమోదు చేస్తారు. ఎవరైనా రాకపోతే ఆ విషయాన్ని సిస్టమ్‌లో అప్‌డేట్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఖాళీ బెర్త్‌ను అర్హత ఉన్న RAC లేదా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఇస్తారు. దీనివల్ల రైలు బయలుదేరాక ఖాళీగా వెళ్లే బెర్త్‌లను వాడుకోవచ్చు.

46
రైల్వే కొత్త రూల్

టికెట్ క్యాన్సిలేషన్ వల్ల ఖాళీ అయ్యే బెర్త్‌లను RAC ప్రయాణికులకు ఇవ్వొచ్చని భారతీయ రైల్వే అధికారిక నిబంధనలు చెబుతున్నాయి. ప్రయాణ మధ్యలో ఖాళీ అయ్యే బెర్త్‌లను కూడా వీరికి కేటాయించవచ్చు. HHT డివైజ్ ద్వారా ఖాళీ బెర్త్‌ల సమాచారాన్ని రికార్డ్ చేసి, తర్వాతి స్టేషన్లకు కూడా సమాచారం పంపుతారు. ఈ టెక్నాలజీ వల్ల బెర్త్‌ల కేటాయింపులో పారదర్శకత పెరగడంతో పాటు పేపర్ వర్క్ కూడా తగ్గింది.

56
రైలు వెయిటింగ్ టికెట్

ఇక్కడ ప్రయాణికులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. "RAC టికెట్ ఉంటే బెర్త్ దొరుకుతుందని గ్యారెంటీ లేదు. రైల్వే రూల్స్, ఖాళీగా ఉన్న బెర్త్‌ల ఆధారంగానే కేటాయింపు జరుగుతుంది. ప్రయాణికుల స్టేటస్, బుకింగ్ ఆర్డర్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. HHT డివైజ్ ద్వారా ఖాళీ బెర్త్‌లను కేటాయించే విధానం ఇప్పటికే అమల్లో ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

66
రైలు బెర్త్ రూల్స్

టీటీఈతో పనిలేకుండా ఆటోమేటిక్‌గా బెర్త్ దొరుకుతుందనే వదంతులను ప్రయాణికులు నమ్మొద్దు. మీ RAC స్టేటస్ గురించి తెలుసుకోవాలన్నా, ప్రయాణంలో ఏదైనా సమస్య వచ్చినా రైల్వే హెల్ప్‌లైన్ 'రైల్ మదద్' సేవలను వాడుకోవచ్చు. రైల్వే అధికారిక పోర్టల్‌లో మీ PNR, రైలు నంబర్, కోచ్, సీటు లేదా బెర్త్ వివరాలను నమోదు చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories