గౌతమ్ అదానీ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో గుర్తింపు..

First Published Sep 16, 2022, 1:43 PM IST

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు.ఇప్పుడు ప్రపంచంలోని టాప్-10 బిలియనీర్ల జాబితాలో ఎలాన్ మస్క్ తర్వాత, గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 

adani

గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ తర్వాత గౌతమ్ అదానీ రెండో అత్యంత సంపన్నుడి జాబితాలో నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కు నెట్టి గౌతం అదానీ ఈ స్థానాన్ని సాధించాడు. గత కొద్ది కాలంగా రెండో నంబర్ కోసం ఇద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం మూడవ స్థానంలో కొనసాగుతున్నారు.

గౌతమ్ అదానీకి ఎంత ఆస్తి ఉందో తెలుసా?
బ్లూమ్‌బెర్గ్  బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 60 ఏళ్ల గౌతమ్ అదానీ ఆస్తి విలువ ప్రస్తుతం 154.7 బిలియన్ డాలర్లుగా ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ విలువ కూడా 153.8 బిలియన్ డాలర్లు. అదే సమయంలో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న టెస్లా చీఫ్  ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ ఆస్తుల విలువ  273.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు, CEO జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ  149.7 బిలియన్ డాలర్లుగా ఉంది.

2022లో అదానీ ఆస్తులు రాకెట్ స్పీడులో పెరిగాయి
అదానీ గ్రూప్ నికర విలువ 2022లో వేగంగా పెరిగింది. గౌతమ్ అదానీ ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ వేగంగా 2వ స్థానంలో నిలిచారు. గత 24 గంటల్లో అదానీ, మస్క్ ఆస్తుల విలువ అమాంతం పెరిగింది.24 గంటల్లో అదానీ నికర విలువ 4.9 బిలియన్లు పెరిగింది. ఇక 2022 జనవరి నుంచి అదానీ సంపద 60.9 బిలియన్లు పెరిగింది. 

గౌతమ్ అదానీ ఫిబ్రవరి 2022లో ముఖేష్ అంబానీని వెనక్కు నెట్టేశాడు...
గత నెలలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను గౌతమ్ అదానీ వెనక్కు నెట్టేశాడు. బిల్ గేట్స్ నికర విలువ 117 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది అదానీ నికర విలువ 60 బిలియన్ డాలర్లు పెరిగింది. దేశంలోని ఇతర ధనవంతుల కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఈ ఏడాది ఫిబ్రవరిలో గౌతమ్ అదానీ రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టారు. దీంతో అదానీ భారతదేశంతో పాటు ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. అదానీ నికర విలువ ఏప్రిల్ 2022లో మొదటిసారిగా 100 బిలియన్లను దాటింది.

ఈ కంపెనీ కారణంగా అదానీ ఆస్తుల విలువ అమాంతం పెరిగింది...
బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీని నంబర్ టూగా నిలబెట్టిన కంపెనీలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ప్రధాన దోహదపడ్డాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు బిఎస్‌ఇలో ఒక్కో షేరుకు రూ.3865.60కి చేరాయి. ఇది దాని కొత్త 52 వారాల గరిష్ట ధర. అదే సమయంలో, మార్కెట్ క్యాప్ పరంగా కూడా కంపెనీ ఎల్‌ఐసి, ఐటిసి వంటి కంపెనీలను అధిగమించి కొత్త రికార్డులను సాధించింది. షేర్ల పెరుగుదల కారణంగా ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4.31 లక్షల కోట్లకు చేరుకుంది.

click me!