Business Ideas: మహిళలు ఇంటి వద్దే రోజుకు 3 గంటలు కష్టపడితే చాలు, రోజుకు రూ. 800 పక్కాగా సంపాదించుకునే చాన్స్

First Published Sep 15, 2022, 4:35 PM IST

మహిళలు ఇంటి వద్ద ఉండే సంపాదించాలని ఆలోచిస్తున్నారా, పెరుగుతున్న ఖర్చులకు మీ ఆదాయం సరిపోవడం లేదా అయితే మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది.అలాంటి వ్యాపార ఐడియా కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలు తమ ఇంటి వద్ద ఉండే రోజు కనీసం రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే కష్టపడి చాలు,  వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే ఒక ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల చాలామంది రాత్రివేళ భోజనం చేసే బదులు చపాతీలు పుల్కాలు ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ బిజీ లైఫ్ లో చపాతి, పుల్కాలను ఇంట్లో చేసుకొని తినడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాల నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత చపాతీలు చేసుకొని తినడం అనేది పెద్ద ప్రయాస అనే చెప్పాలి. ఇక ఓపిక లేక చాలామంది అన్నంతో రాత్రిపూట కూడా కానిచ్చేస్తున్నారు.

దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశం గా మార్చుకోవచ్చు. మీ ఖాళీ సమయంలో చపాతీలు, పుల్కాలు చేయడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే మూడు గంటల పాటు మీరు చపాతీలు పుల్కాలు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక చపాతి కనిష్టంగా ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అంటే రోజుకు కనీసం వంద చపాతీలు అమ్మిన మీకు 500 నుంచి దాదాపు 800 వరకు ఆదాయం లభిస్తుంది.  ఇక గోధుమ పిండిని హోల్ సేల్ మార్కెట్లో కొనుగోలు చేయడం ద్వారా మీకు ఖర్చు తగ్గుతుంది.

ఇక ఈ చపాతీ సెంటర్ ఏర్పాటు కోసం మీరు మీ ఇంటి వద్ద చేసుకోవచ్చు. లేదా మరేదైనా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకొని సాయంకాలం 3 గంటల పాటు ఈ పని చేస్తే సరిపోతుంది. చక్కటి ఆదాయం పొందే వీలుంది.  ఒక సహాయకున్ని పెట్టుకోవడం ద్వారా మీరు చక్కగా  చపాతీ పుల్కా వ్యాపారం చేయవచ్చు.

పెద్ద ఎత్తున చపాతి పుల్కా బిజినెస్ కొనసాగించాలి అనుకుంటే ...
Commercial Roti Bhatti Gas Stove, For Used To Chapati Maker కొనుగోలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఈ వ్యాపారంలో మీరు చపాతీలను తయారు చేయవచ్చు. ముఖ్యంగా నూనె వేసి కాల్చే చపాతీలతో కన్నా నూనె లేకుండా కాల్చే పుల్కాలకు మరింత గిరాకీ ఉంది..

ఇక చపాతీ తో పాటు రెండు రకాల కర్రీలను పెట్టుకోవడం ద్వారా మీకు అదనంగా ఆదాయం లభించవచ్చు. ముఖ్యంగా వెజ్ నాన్ వెజ్ కర్రీ లను ముందుగానే ప్రిపేర్ చేసుకొని చపాతీ సెంటర్లోనే విక్రయించవచ్చు. తద్వారా మీకు అదనపు ఆదాయం లభిస్తుంది.

click me!