Business Ideas: పూజా సామాగ్రి బిజినెస్ ఎలా ప్రారంభించాలి, ఎంత లాభం వస్తుంది..ఎంత పెట్టుబడి పెట్టాలి.

First Published Sep 15, 2022, 4:06 PM IST

వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా, అయితే వెనకడుగు వేయకుండా మంచి ఆలోచనతో వ్యాపారం ప్రారంభిస్తే, చక్కటి లాభాలను పొందవచ్చు. అలాగే మీరు ఉపాధి పొందడంతో పాటు నలుగురికి ఉపాధి పంచవచ్చు. అయితే ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా. అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఓ వ్యాపారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పూజా సామాన్లను రిటైల్ దుకాణంలో విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే మార్గం మనకు కనిపిస్తుంది. అయితే ఈ పూజా సామాన్లను ఎక్కడ నుంచి సేకరించాలి, అనేది మనకి ఒక ప్రశ్న రావచ్చు. అయితే కిరాణా సామాన్ల తరహా లోనే పూజా సామాన్లను కూడా హోల్ సేల్ మార్కెట్లో విక్రయిస్తారు. ముఖ్యంగా కుంకుమ, పసుపు, నవధాన్యాలు, దేవుళ్ళ చిత్రపటాలు,  అలాగే ఇతర పూజ సామాగ్రి మీ షాపులో పెట్టుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు.

పెళ్లిళ్లు, సత్యనారాయణ వ్రతం, కర్మలు ఇలా నిత్యం పూజా సామాగ్రికి మంచి గిరాకీ ఉంటుంది ఈ పూజా సామాగ్రిని మీరు దేవాలయాల సమీపంలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా భక్తుల నుంచి మీకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. అయితే ఈ పూజా సామాగ్రిని మీరు స్టోర్ చేసుకోవడానికి మరొక గదిని ఏర్పాటు చేసుకుంటే మంచిది. తద్వారా సరుకులు దాచుకొని మీరు విక్రయించుకొని మంచి లాభం పొందే వీలుంది. అయితే ఇందులో లాభం ఎలా దక్కుతుంది. అని మీకు ప్రశ్న ఉద్భవించవచ్చు. మీరు హోల్ సేల్ మార్కెట్లో లభించే ధర కన్నా కూడా మీరు చిల్లరగా విక్రయించే వస్తువులపై లాభం మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా పూజా సామాగ్రిపై కూడా మీరు చక్కటి లాభం పొందవచ్చు.

ఉదాహరణకు మీరు పసుపును కేజీ లెక్కన మీరు కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా వాటిని  విక్రయించినట్లయితే, ఒక కేజీ పసుపు పై మీరు సుమారు 50% లాభం వరకు పొందవచ్చు. అలాగే ఇతర పూజ ద్రవ్యాల పైన కూడా వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా విభజించి విక్రయించడం ద్వారా చక్కటి లాభం పొందవచ్చు.

ఇక స్థానికంగా ఉండే పూజారులు అలాగే దేవాలయాలతో చక్కటి సంబంధాలు ఏర్పాటు చేసుకొని మీరు వాటికి నిత్యం పూజా ద్రవ్యాలు సప్లై చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటే, మీకు గిరాకీ మరింత పెరుగుతుంది

ఇక పూజా సామాగ్రి షాపు ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మీ పూజాగది సామాగ్రి షాపు ఏర్పాటు కోసం ఒక షాపును రెంటుకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మరొక గదిని కూడా అద్దెకు తీసుకోవడం లేకుంటే మీ ఇంట్లోనే ఒక గదిని కేటాయించడం వల్ల తెచ్చిన సరుకులు దాచుకునే వీలు కలుగుతుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే, మంచి సెంటర్లో షాపు తీసుకోవాలి. ముఖ్యంగా దేవాలయాలు దగ్గర్లో ఉండాలి. అలాగే పెట్టుబడి కింద రూ. 50 వేల వరకూ సరుకు తెచ్చుకుంటే, ప్రతి నెల రూ. 30 నుంచి రూ. 60 వేల వరకూ సంపాదించుకోవచ్చు. 

ఇక పూజా సామాగ్రి విషయంలో భక్తులు అలాగే కష్టమర్లు చాలామంది తమకు కావాల్సిన వస్తువులను వెతుక్కుంటూ వస్తారు. ఒకవేళ ఆ వస్తువు మీ వద్ద లభించకపోతే ఆ వస్తువు ఏంటో మీరు నోట్ చేసుకొని దాన్ని తెప్పించుకోవడం ద్వారా మీరు మరో ఇతర కస్టమర్లను కోల్పోరు.

click me!