ఇలా చేయ‌క‌పోతే మీ గ్యాస్ స‌బ్సిడీ క‌ట్ అవ్వ‌డం ఖాయం.. ఏం చేయాలంటే.?

Published : Oct 31, 2025, 07:20 AM IST

Gas subsidy: డొమెస్టిక్ గ్యాస్ వినియోగ‌దారులు, ముఖ్యంగా స‌బ్సిడీ పొందే వారికి ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి చేశారు. ప్ర‌తీ ఏటా మార్చి 31వ తేదీ లోపు ఈ- కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే సబ్సిడీ పథకాలు నిలిపివేస్తారు. 

PREV
15
ప్రతి ఏడాది ఈ-కేవైసీ తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎల్పీజీ సబ్సిడీ పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. ఇది ప్రతి గృహ వినియోగదారికి వర్తిస్తుంది. ఈ ప్రక్రియ చేయించుకోకపోయినా గ్యాస్‌ సరఫరా ఆగదు కానీ సబ్సిడీ మాత్రం లభించదు.

25
ఈ-కేవైసీ చేయించుకునే మూడు మార్గాలు

వినియోగదారులు తమ కంపెనీ ఆధారంగా (ఇండియన్‌ ఆయిల్‌, హెచ్‌పీ, భారత్‌ పెట్రోలియం) మొబైల్‌ యాప్ ద్వారా సులభంగా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవచ్చు. అలాగే సమీప గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ కార్యాలయంలో లేదా సిలిండర్‌ డెలివరీ బాయ్‌ వద్ద ఉండే యాప్‌ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ మూడు మార్గాల ద్వారా అందించే సేవలు పూర్తిగా ఉచితం.

35
సబ్సిడీ నిలుపుదలపై కీలక నిబంధనలు

ప్రతి సంవత్సరం గరిష్టంగా 9 ఎల్పీజీ సిలిండర్లకు మాత్రమే కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అయితే 8వ, 9వ సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు ముందు బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయాల్సిందే. ధ్రువీకరణ ఆలస్యమైతే ఆ సబ్సిడీని తాత్కాలికంగా నిలిపివేస్తారు.

45
మార్చి 31 చివరి గడువు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ-కేవైసీని మార్చి 31లోపు పూర్తి చేయని వినియోగదారులు ఆ సబ్సిడీని శాశ్వతంగా కోల్పోతారు. అయితే గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే నిలిపివేసిన సబ్సిడీ మొత్తాన్ని తిరిగి జమ చేస్తారని ఆయిల్‌ కంపెనీలు పేర్కొన్నాయి.

55
అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సమాచారం

సబ్సిడీ, ఈ-కేవైసీ ప్రక్రియ, బయోమెట్రిక్ ధ్రువీకరణ పద్ధతులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌ www.pmuy.gov.in/e-kyc.html సందర్శించవచ్చు. కాబ‌ట్టి గ్యాస్‌పై స‌బ్సిడీ పొందుతున్న వారు వెంట‌నే ఈ కేవైసీ చేసుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories