Gold Hunting: తుఫాను ప్రభావం వల్ల ఉప్పాడ తీరంలో బంగారం వేట సాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరంలో బంగారు రేణువులు దొరుకుతున్నాయని స్థానికులంతా బీచ్ లో వెతకడం ప్రారంభించారు. నిజంగానే ఉప్పాడ తీరంలో బంగారం దొరుకుతుందా?
కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరం తుఫాను వల్ల ఎంతో ప్రభావితమైంది. అయితే ఆ తుఫాను ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరానికి బంగారాన్ని మోసుకొచ్చిందని వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ఉప్పాడ సముద్ర తీరానికి స్థానికులంతా పరుగులు తీశారు. ఇసుకలో మెరుస్తున్న బంగారు రంగు రేణువులను సేకరించడం మొదలుపెట్టారు. అయితే అవి నిజంగా బంగారు రేణువులో కాదో మాత్రం ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. ప్రస్తుతం ఉప్పాడ తీరంలో దొరుకుతున్న బంగారు రేణువులపైనే అందరి దృష్టి పడింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఉప్పాడ సముద్ర తీరానికి వెళుతున్న గ్రామస్తులు సంఖ్య పెరుగుతోంది.
24
సముద్రం నుంచి కొట్టుకువస్తున్న బంగారం
ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో జీవించే ప్రజలకు ఎప్పటినుంచో ఒక నమ్మకం ఉంది. తుఫానులు, భారీ వర్షాలు పడినప్పుడు సముద్ర తీరానికి పెద్ద ఎత్తున అలలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ సమయంలో సముద్రం నుంచి ఎన్నో వస్తువులు ఒడ్డుకు చేరుకుంటాయి. వాటిని గ్రామస్తులు అమ్ముకోవడం ద్వారా డబ్బు చేసుకుంరు. అలాగే బంగారు రేణువులు తీరంలో దొరుకుతాయనే ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. దాంతో తుఫానులు వచ్చి వెళ్లిన వెంటనే ఉప్పాడ సముద్ర తీరంలో గ్రామస్తులు ఇసుకను జల్లెడ పడుతూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో ఎవరూ నిర్ధారించలేదు.
34
అలలు విరుచుకుపడి
మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులంతా ఉప్పాడ తీరంపైనే తమ దృష్టిని పెట్టారు. ఆ తీరం నుంచి అంత ఎత్తున అలలు ఎగిసిపడి గ్రామాలపై విరుచుకుపడ్డాయి. అలలు ఎగసి పడినప్పుడల్లా గ్రామస్తులు భయంతో విలవిలలాడిపోయారు. ఇప్పుడు సముద్రం శాంతించడంతో గ్రామస్తులంతా బీచ్ దారిన పడ్డారు. సముద్రపు ఒడ్డున బంగారు రేణువులు దొరుకుతాయనే ప్రచారంతో వందల సంవత్సరాలుగా ఇలా వెతుకుతూనే ఉన్నారు.
వందల సంవత్సరాల కిందట ఈ సముద్ర కాలగర్భంలోనే రాజుల నివాసాలు, బంగారు ఆభరణాలు కలిసిపోయాయని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే తుఫానులు వచ్చినప్పుడల్లా ఆ బంగారం బయటికి వస్తుందని నమ్ముతారు. అందుకే బీచ్ లో వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మొంథా తుఫాను వల్ల బీచ్ లో బంగారు వెతుకులాట మొదలైపోయింది. కేవలం స్థానిక గ్రామస్తులే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా బంగారు వేట కోసం ఎంతోమంది ఉప్పాడ తీరానికి చేరుకున్నారు. ఇప్పటికే కొంతమంది తమకు బంగారు రేణువులు దొరికాయంటూ మెరిసిపోతున్న చిన్న చిన్న బంగారు రేణువులను చూపించారు. పెద్దా చిన్నా తేడా లేకుండా ఉప్పాడ సముద్రతీరంలోని ఇసుకను జల్లెడ పట్టడం ప్రారంభించారు. నిజంగానే అది బంగారమా? ఉప్పాడ తీరంలో బంగారం దొరుకుతుందా? అనేది అధికారులే నిర్ణయించి చెప్పాలి.