సామాన్యుడిపై పెరుగుతున్న ఇంధన భారం.. నేడు రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..

First Published Jun 7, 2021, 10:49 AM IST

ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు వరుసగా రెండో రోజు ఇంధన ధరలను పెంచాయి. నేడు డీజిల్ ధరపై  26 నుంచి 27 పైసలు పెరగగా, పెట్రోల్ ధరపై 27 నుంచి 28 పైసలు పెరిగింది.
 

గత కొద్దిరోజులుగా ఇంధన ధరల వరుస పెంపుతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీకి చేరువలో ఉంది.
undefined
ఢీల్లీలో పెట్రోల్ ధర సోమవారం లీటరుకు రూ.95ను దాటింది. నేడు ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.95.37 కాగా, డీజిల్ ధర రూ.86.28.
undefined
ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.47 చేరుకుంది, డీజిల్ ధర లీటరుకు రూ.93.64గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.96.77, కోల్‌కతాలో రూ.95.34కు చేరింది. మే 4 నుండి 21వ సార్లు ఇంధన ధరలను పెంచాయి.
undefined
ఒక నెలలో 17వ సారి వాహన ఇంధన ధరలను పెంచడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
undefined
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం దేశంలోని మూడు ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థలు. వాల్యు ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా ఇంధన ధరలు దేశంలో ప్రతిరాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
undefined
జీవనోపాధి కోసం స్కూటర్లు లేదా బైకులపై వెళ్ళే వారు పెట్రోల్ ధర రూ.100కు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ.98.48, డీజిల్ ధర రూ.93.38గా ఉంది.
undefined
click me!